Vijayasai Reddy : విశాఖలో అక్రమ కట్టడాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. భీమిలి సముద్ర తీరంలో సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా సాగిన నిర్మాణాలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. వైసీపీ ఎంపీ విజయిసాయిరెడ్డి కుమార్తె నిర్మించిన ప్రహరీ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.