టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20ల్లో నంబర్-1 బౌలర్‌గా అవతరించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎన్నికైన ఈ 23ఏళ్ల బౌలర్ అఫ్ఘాన్ స్టార్ బౌలర్ రషీద్‌ఖాన్‌ను పక్కకు నెట్టి టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు.
Trinath
ByTrinath
తెలంగాణ ఎన్నికల ఫలితంతో ఏపీ సీఎం జగన్ వ్యూహం మార్చినట్లు సమాచారం. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడని జగన్ ఆలోచిస్తారని సమాచారం. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు బదులుగా కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారన్న టాక్ నడుస్తోంది.
ByTrinath
రాహుల్ గాంధీ కార్యాలయానికి 'AMకి' 'PMకి' మధ్య తేడా తెలియదని ప్రణబ్‌ముఖర్జీ తనతో అన్నట్లు ఆయన కుమార్తే శర్మిష్ఠ చెప్పారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో ఆమె పుస్తకాన్ని రాశారు. 2013లో ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ చెత్తబుట్టలో పడేసిన తీరుపై తన తండ్రి కలత చెందినట్లు తెలిపారు.
ByTrinath
మిచౌంగ్(మిగ్జామ్) తుపాను మరింత బలహీనపడనుంది. అయితే వర్షాలు తగ్గే చాన్స్ మాత్రం ఇప్పుడే లేదు. రానున్న 12-18 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు భారీ వర్షపాతం సంభవించవచ్చు.
ByTrinath
జనవరి 22, 2024న అయోధ్యలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం. అటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, ముఖేష్ అంబానీ, రతన్ టాటా లాంటి ప్రముఖులు కూడా ఆహ్వానం పంపనున్నట్లు తెలుస్తోంది.
ByTrinath
ఎన్నికలకు ముందు జరిగిన 'ఇండియా టుడే' కాన్‌క్లేవ్‌లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ డీఎన్‌ఏ బీహార్‌కు చెందినదని.. తన డీఎన్‌ఏ తెలంగాణదని చెప్పిన రేవంత్.. బీహార్ డీఎన్‌ఏ కంటే తెలంగాణ డీఎన్‌ఏ గొప్పదంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. రేవంత్ కామెంట్స్ ఓల్డ్ వీడియో వైరల్‌గా మారింది.
ByTrinath
119మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలోకి ఈ సారి 43మంది రెడ్డి కులానికి చెందిన వారే అడుగుపెట్టనున్నారు. 13 మంది వెలమలు, నలుగురు కమ్మలు, బ్రాహ్మణ, వైశ్య కులాల నుంచి ఒక్కొక్కరు అసెంబ్లీలో అడుగుపెడతారు. అంటే 119 మంది ఎన్నికైన ప్రతినిధులలో 52శాతం అగ్రకులాల వారే ఉన్నారు. అటు బీసీల ఎమ్మెల్యేల సంఖ్య 19గా ఉంది.
ByTrinath
డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ మంత్రులు. ఏపీ, హైదరాబాద్‌లో రెండు చోట్లా 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ లో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు.
ByTrinath
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారు. సునీల్ టీమ్ సోషల్‌మీడియా క్యాంపెయినింగ్, నినాదాలు, కన్‌విన్సింగ్ ఫార్ములా, టికెట్ల కేటాయింపు.. ఇలా ప్రతీవిషయంలోనూ సునీల్ కనుగోలు టీమ్ కీలకంగా వ్యవహరించింది.
ByTrinath
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో(2024) 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు. అయితే ఇది అంత ఈజీనా? బీజేపీకి 400 ఎంపీ సీట్లు పక్కానా? తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. అందుకోసం హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ravi-bishnoi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ap-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pranab-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ap-rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ayodya-sachin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/revanth-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ts-assembly-inside-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ap-jogi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sunil-kanugolu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/modi-bjp-jpg.webp)