National Women's Day: సరోజినీ నాయుడు జన్మదినాన్ని మహిళా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా? By Trinath 13 Feb 2024 Sarojini Naidu : సరోజినీనాయుడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహిళ. ఫిబ్రవరి 13, 1879న హైదరాబాద్‌లోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. ఆమె జన్మదినాన్నే జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు.
NEET : నీట్ యూజీ ఎగ్జామ్.. ఎన్ని ప్రశ్నలుంటాయి..? నెగిటివ్ మార్కింగ్ ఎంత? By Trinath 13 Feb 2024 నీట్ యూజీ(NEET UG) పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది.
Delhi Chalo : రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఢిల్లీ చలోపై ఉత్కంఠ! By Trinath 13 Feb 2024 Delhi Chalo : ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. 200 రైతు సంఘాలు, పెద్ద సంఖ్యలో రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి చేరుకోనుంది. అసలు రైతుల డిమాండ్లు ఏంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
APPSC Jobs : నిరుద్యోగులకు అలెర్ట్.. 290 లెక్చరర్ల పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు! By Trinath 13 Feb 2024 APPSC : ఏపీలో 290 లెక్చరర్ పోస్టులను భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.250తో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.57,700 -రూ.1,82,400 వరకు వేతనం ఉంటుంది.
BRS vs Congress: ముదురుతున్న వాటర్ వార్.. పోటాపోటీగా టూర్లు, సభలు! By Trinath 13 Feb 2024 అటు మేడిగడ్డకు రేవంత్.. ఇటు నల్గొండకు కేసీఆర్ వెళ్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై బీఆర్‌ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా.. లోక్‌సభ ఎన్నికలకు కూడా ఇదే అస్త్రంతో ముందుకువెళ్తోంది.
KCR : ఇక కాస్కోండి.. నల్గొండ మారుమోగేలా నేడు కేసీఆర్ భారీ బహిరంగ సభ..! By Trinath 13 Feb 2024 KCR : నల్గొండ జిల్లాలో ఇవాళ మ:3 గంటలకు బీఆర్‌ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. సభకు హెలికాప్టర్లో రానున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం సాగునీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Revanth Reddy: నేడు మేడిగడ్డ బ్యారేజీకి మంత్రులతో రేవంత్ రెడ్డి! By Trinath 13 Feb 2024 సీఎం రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాసేపట్లో వెళ్లనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం చేరుకుంటుంది.
Accident: బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు సజీవదహనం! By Trinath 12 Feb 2024 యూపీ-మధురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుగా బస్సు డీవైడర్‌ను ఢీకొట్టింది.. ఆ వెంటనే వెనుక నుంచి వస్తున్న కారు బస్సును ఢీకొట్టింది. దీంతో కారుతో పాటు బస్సులోనూ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవదహనమయ్యారు.
Uttam: కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపం.. ఇరిగేషన్ పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్! By Trinath 12 Feb 2024 ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కేసీఆర్ పాపాలు తెలంగాణకు శాపంగా మారాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నారని ఆరోపించారు.