author image

Trinath

Chandrababu arrest: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు.. FIRలో తన పేరు లేదంటున్న టీడీపీ అధినేత!
ByTrinath

టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన అరెస్టుకు కారణం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబును దగ్గరకు పోలీసులు వెళ్లనివ్వకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టీడీపీ నాయకులు గొడవకు దిగారు . ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. Chandrababu Naidu Arrest

TS assembly elections: అన్నపై తమ్ముడి పోటీ! రణరంగానికి సిద్ధమౌతున్న కాషాయసేన
ByTrinath

ఎన్నికల రణరంగానికి కాషాయసేన సిద్ధమౌతోంది. నేతలకు పని విభజనపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది. బీజేపీ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ సభ్యులు. సమావేశంలో జవదేకర్,సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ప్రచార కమిటీ పగ్గాలపై కీలక చర్చ నడుస్తోంది.

G20 summit: మోదీ బిజీబిజీ.. మూడు రోజుల్లో 15 మంది ప్రపంచ నాయుకులతో ప్రధాని భేటీ!
ByTrinath

సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో భాగంగా.. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న ప్రధాని మోదీ యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలుండగా.. సెప్టెంబర్ 10 న ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో మోదీ లంచ్ మీటింగ్ ఉంటుంది.

Chandrababu: చంద్రబాబు అరెస్ట్ అవుతారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హాట్ కామెంట్స్!
ByTrinath

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్య కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యే అవకాశామే లేదని..ఇదంతా వైసీపీ నేతల కుట్ర అని ఆరోపించారు. Satya kumar hot comments on Chandrababu Naidu Arrest

Dhoni with Trump: ట్రంప్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడిన ధోనీ.. వైరల్‌ వీడియో..!
ByTrinath

భారత లెజెండరీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ ప్రస్తుతం అమెరికాలో విహారయాత్రలో ఉన్నాడు. ఇటివలే US ఓపెన్‌ మ్యాచ్‌లో కనిపించాడు. ఇక తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలిశారు. ధోనీని గోల్ఫ్ ఆడటానికి ట్రంప్‌ ఆహ్వానించారు. ట్రంప్‌ ఆహ్వానాన్ని అంగీకరించిన ధోనీ కాసేపు గోల్ఫ్‌ ఆడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. MS Dhoni playing golf with Donald Trump

TS DSC Notification 2023: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్‌.. ఖాళీల వివరాలివే!
ByTrinath

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్షను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ , మెదక్, ఆదిలాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం , నల్గొండలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వేతన పరిధి రూ. రూ. 24,600 నుంచి రూ. నెలకు 49,100 వరకు ఉంటుంది. TS DSC NOTIFICATION 2023

Human Embryo: సంచలనం..! అండం, వీర్యకణాలు లేకుండా మానవ పిండాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు!
ByTrinath

వీర్యం, అండాలు, గర్భాశయం ఉపయోగించకుండా ప్రయోగశాలలోని మూలకణాల నుంచి మానవ పిండం నమూనాను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. 14వ రోజు పిండాన్ని పోలి ఉండే ఈ నమూనా అంతర్గత నిర్మాణాలను సంతరించుకుంటుందని, కానీ శరీర అవయవాలకు పునాదులు వేసే ముందు ఈ నమూనా ఉంటుందని ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్ మన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం తెలిపింది. Human Embryo without Eggs or Sperm

Rain Alert for Telugu states: రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక!
ByTrinath

ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 2.1మీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి ఉండగా.. రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా చెదురుమదురు వానలు కురుస్తాయి. తీరం వెంబడి 45-55కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.Rain Alert for Telugu states

Bus Fire: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి బస్‌లో మంటలు..  టైర్ పేలడంతో ప్రమాదం!
ByTrinath

నల్గొండ జిల్లా పరిధిలో ప్రైవేట్‌ బస్‌ అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisment
తాజా కథనాలు