జీ20 సమ్మిట్‌కి దేశ రాజధాని అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రేపు(సెప్టెంబర్ 09), ఎల్లుండి(10) ఢిల్లీలో జీ20 సమావేశాలు జరగనుండగా.. ప్రపంచదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తున్నారు. దీంతో కుతుబ్ మినార్(Qutab Minar) నుంచి ఇతర చారిత్రక కట్టడాల వరకు దాదాపు అన్నిటికి లైట్ ఎఫెక్ట్స్ పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Trinath
ByTrinath
అందరూ ఎదురుచూస్తున్న గ్లోబల్ లీడర్స్ ఈవెంట్, 18వ జీ20 సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. భారత్‌కు అమెరికా నుంచి ఇద్దరు అతిథిలు రానున్నారు. అందులో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉంది. అదే అమెరికా అధ్యక్షుడి కారు 'బీస్ట్'. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇది. పెద్ద సైనిక రవాణా విమానం బోయింగ్ C-17 గ్లోబ్‌మాస్టర్-IIIలో అమెరికా నుంచి ఇండియాకు తీసుకురానున్నారు.
ByTrinath
కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లో పడేసేందుకు బీజేపీ మరో అస్త్రంతో సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఓబీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓబీసీ(OBC) రిజర్వేషన్లలో మార్పులు తీసుకురానుందని సమాచారం. ఓబీసీ ఉప వర్గీకరణకు సంబంధించి జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జూలైలో సమర్పించారు.Rohini Panel Report
ByTrinath
సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగానే.. మరో డీఎంకే మంత్రి రాజా కొత్త దుమారాన్ని రేపారు. సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీ(HIV)తో పోల్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించిన ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్ వేశారు. 'జాతిహత్య' అనే పదాన్ని ఉదయనిధి అసలు ఎక్కడా అనలేదని.. అన్ని విషయాలు తెలుసుకోకుండా మోదీ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదంటూ చురకలంటించారు. CM Stalin Counters Modi
ByTrinath
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్య-భూమి ఎల్1 పాయింట్ వద్ద క్యాప్చర్ అయిన ఫొటోలను షేర్ చేసింది. ఆదిత్య-ఎల్1 సెల్ఫీ తీసుకుంటూ భూమి -చంద్రుని చిత్రాలను క్లిక్ చేసింది. ఆదిత్య-ఎల్1 క్లిక్ చేసిన చిత్రాలను, సెల్ఫీని కూడా స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. Aditya L1 shares selfie from Space
ByTrinath
ఢిల్లీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు పాల్గొనే శిఖరాగ్ర సమావేశానికి వేదిక ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్ . కొత్త ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC)ని ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో జాతికి అంకితం చేశారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలోని మిగిలిన వేదికలన్నీ ఇన్‌స్టాలేషన్‌లు, లైట్లతో అలంకరించి ఉన్నాయి. దాదాపు 123 ఎకరాల క్యాంపస్ ప్రాంతంతో, IECC కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్దది. భారత్ మండపం సుమారు రూ.2,700 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. Bharat Mandapam
ByTrinath
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా దంచిపడేస్తున్నాడు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తునన్నాయి. దీంతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ByTrinath
నిజామాబాద్‌లో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక స్నేహా తివారీ ఉరేసుకుంది. సోఫియాన్ అనే విద్యార్థి వేధింపులే కారణమని.. రోజూ ప్రేమించాలని వేధించేవాడంటున్న కుటుంబసభ్యులు. Nizamabad student suicide
ByTrinath
ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలోపు వారిలో కొత్త క్యాన్సర్ కేసులు 79 శాతం పెరిగినట్లు తాజా క్యాన్సర్ అధ్యయనం తెలిపింది. మన దేశంతో సహా 200 దేశాల్లోని క్యాన్సర్ కేసులపై అధ్యయనం చేశారు. 1990-2019 మధ్య కాలంలో 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసులు భారీగా పెరిగినట్టు గుర్తించారు. మారిన లైఫ్‌స్టైల్, ధూమపానం, మద్యపానం, అధిక బరువు అనేక అనారోగ్యాలను తీసుకోస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
ByTrinath
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ(IBPS RRB) క్లర్క్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు IBPS అధికారిక సైట్ ibps.in ద్వారా రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు . ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 16న జరగనుంది. ప్రిలిమ్స్ స్కోర్‌లు సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. IBPS RRB Clerk Prelims Result Released
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/biden-carr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/obccc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/sanathanaaa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/selfie-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bp-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/vsp-rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/love-nzb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/alcohol-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/results-jpg.webp)