చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర పెద్దలు..! జగన్ ఢిల్లి పర్యటన వాయిదా..! కారులో ఎయిర్ బ్యాగులు.. రోడ్లపై వరదలా పారిన వైన్.. లాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Trinath
ByTrinath
బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్షకు దిగిన బీజేపీ అగ్రనేతలతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీక్షకు 6గంటల వరుకే పర్మిషన్ ఉందన్న పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బలవంతంగా దీక్షాస్థలి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఛాతీకి గాయమైందని.. ఎక్స్‌రే తీయించుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం.
ByTrinath
లిబియాలో డేనియల్ తుఫాన్ జల ప్రళయం సృష్టించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) చెప్పిన లెక్కల ప్రకారం వరదల ధాటికి కనీసం 30,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరణాల సంఖ్య 20 వేల దాటవచ్చని సమాచారం. తూర్పు ప్రాంతాలతో పాటు పశ్చిమాన ఉన్న మిస్రాటా నగరం కూడా వరద తాకిడికి గురైంది. మరోవైపు ప్రజలు విలవిలలాడిపోతున్నా సహాయకచర్యలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి.
ByTrinath
చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. చంద్రబాబు విషయంలో జూనియర్ సైలెంట్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మావయ్య విషయంలో ఏం మాట్లాడాలో జూనియర్ ఎన్టీఆర్ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. కష్టకాలంలో ఎందుకు స్పందించడం లేదంటున్న టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ట్విట్టర్‌లోనూ తారక్ స్పందించలేదు. కొడాలి నానితో స్నేహం వల్లే చంద్రబాబును దూరం పెట్టారంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి.
ByTrinath
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల విడుదల, బడ్జెట్ ఆమోదం, కౌన్సిల్ సమావేశాలపై సంతకం చేసే ఫారమ్‌లతో సహా 13 చోట్ల చంద్రబాబు నాయుడు చేతిరాత సంతకాలు ఉన్నాయని ఏపీ సీఐడీ చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం (APCID) చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు.
ByTrinath
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'రూల్స్ రంజన్' సినిమా వాయిదా పడింది. సెప్టెంబర్ 29కి ఈ సినిమా రావడం లేదు. అక్టోబర్ 6న రూల్స్ రంజన్ థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ మేరకు మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ByTrinath
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా కరారు కానీ నేపథ్యంలో జగన్ తన టూర్ వాయిదా వేసుకున్నారని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ByTrinath
బీజేపీలోకి కృష్ణ యాదవ్ చేరిక వాయిదా పడింది. చీకోటి ప్రవీణ్‌కు కూడా మరోరోజు జాయినింగ్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ సిటీతో పాటు కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మినహయిస్తే బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం తక్కువ ఉంది. బండి సంజయ్‌తో పాటు మరికొందరు నేతలు తీసుకొస్తున్న వాళ్లను పార్టీలో చేర్చుకోవడానికి కండీషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ తెలంగాణ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్ చీకోటి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ByTrinath
మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నెక్ట్స్ స్టెప్ ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైనంపల్లి రైట్ హ్యాండ్ నక్కా ప్రభాకర్‌గౌడ్ కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 99 పర్సెంట్ టిక్కెట్ నీకే అంటూ ప్రభాకర్‌గౌడ్‌కి రేవంత్ రెడ్డికి ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన మైనంపల్లి కాంగ్రెస్‌లోకి చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ByTrinath
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కిషన్ రెడ్డి దీక్షను అడ్డుకున్నారు పోలీసులు. షన్ రెడ్డి వద్దకు వెళ్లిన పోలీసులు. కిషన్ రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు పోలీసులు. దీక్షకు అరు గంటల వరకే పర్మిషన్ ఉందంటున్నారు పోలీసులు. దీక్ష శిబిరం వద్దకు పోలీసులు వెళ్లడంతో ఒక్కసారిగా కిషన్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/meruii-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kishan-reddy-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/libiya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jr-ntrr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-13-at-9.33.14-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/devandar-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bjp-politics-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/mynampally-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kishan-arrest-jpg.webp)