Kishan reddy: కిషన్ రెడ్డి ఛాతీకి గాయం.. శరీరంపై గీరుకుపోయిన గోర్లు! బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగుల సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్షకు దిగిన బీజేపీ అగ్రనేతలతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. దీక్షకు 6గంటల వరుకే పర్మిషన్ ఉందన్న పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని బలవంతంగా దీక్షాస్థలి నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన ఛాతీకి గాయమైందని.. ఎక్స్‌రే తీయించుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. By Trinath 13 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan reddy injured: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి(kishan reddy)కి గాయాలయ్యాయి. నిరుద్యోగుల కోసం హైదరాబాద్ ఇందిరా పార్క్(indira park) వద్ద బీజేపీ అగ్రనేతలు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం ఆరు గంటల వరుకే దీక్షకు పర్మిషన్ ఉందని పోలీసులు చెప్పగా.. రేపు(సెప్టెంబర్ 14) ఉదయం వరకు నిరసన కొనసాగిస్తామని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. పోలీసులు మాత్రం రూల్ ఈజ్ రూల్ అని దీక్ష కంటీన్యూ చేసేందుకు నిరాకరించారు. పోలీసులు దీక్షాస్థలికి చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు కిషన్‌రెడ్డిని చుట్టుముట్టారు. ఎంతసేపటికి దీక్ష విరమించేందుకు కిషన్‌రెడ్డి టీమ్ అంగీకరించకపోవడంతో ఆయన్ను బలవంతంగా అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు గాయాలయ్యాయి. ఛాతీపై గాయం: దీక్షాస్థలి నుంచి పోలీసులు బలవంతంగా తరలించడంతో కిషన్ రెడ్డికి ఛాతీలో గాయమవడంతో పాటుగా.. చేతులపై, ఒంటిపై అక్కడక్కడ గోర్లు గీరుకుపోయాయి. పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పరిశీలించిన వైద్యులు గోర్లు గీరుకుపోయిన చోట్ల ఆయింట్‌మెంట్ ఇవ్వడంతో పాటుగా.. ఛాతీలో అయిన గాయానికి రేపు(సెప్టెంబర్ 14) ఉదయం ఎక్స్‌రే తీసుకోవాలని సూచించారు. ఇతర పారామీటర్లు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ➡ జరిగిన పరిణామాలపై తెలుసుకున్న కేంద్రహోం మంత్రి అమిత్‌షా కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని.. దీనికి కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్: దీక్ష భగ్నం వ్యవహారంతో పాటు కిషన్‌రెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపి డాక్టర్. లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కెసీఆర్ సర్కార్ తీరు నయా నిజాం రాజ్యాన్ని తలపిస్తోందని ఆరోపించారు. శాంతియుతంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిరసన చేస్తోన్న కేంద్రమంత్రి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నానని చెప్పారు. 24 గంటల పాటు ఉపవాస దీక్ష అని చెప్పి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు అక్షేపనీయమన్నారు. కేసీఆర్ సర్కారు నిజస్వరూపం బీజేపీ ప్రజలకు వివరిస్తున్నది కాబట్టే ఆయనకు భయం పట్టుకుందన్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్టుల ద్వారా, దీక్షలను భగ్నం చేయడం ద్వారా తమ పోరాటాన్ని ఆపలేరన్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ సర్కారుకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ALSO READ: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్..! హైటెన్షన్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి