వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటి చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం పట్ల పలువురు కాపు నేతలు, కాపు కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. వంగవీటి మోహన రంగా లాంటి కాపు నేతను పొట్టన పెట్టుకున్న టీడీపీకి పవన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పవన్ నిర్ణయం వల్ల కాపు మెజార్టీ ఓట్లు జగన్‌వైపు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trinath
ByTrinath
జనసైనికులు జెండా కూలీలని.. జనసేన పార్టీ ఎందుకని.. టీడీపీలో విలీనం చేస్తే మంచిదంటూ పవన్‌కల్యాణ్‌కి చురకలంటించారు మంత్రి అమర్నాథ్. రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని పవన్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతమందిని చంపావ్.. ఎంతమందిని ఇబ్బంది పెట్టావ్ అని ప్రశ్నించారు అమర్నాథ్. ముద్రగడను కూడా చంద్రబాబు చంపాలని చూశాడని ఆరోపించారు.
ByTrinath
తెలుగుదేశానికి బలం ఉంది.. జనసేనకు పోరాటపటిమ ఉంది.. వైసీపీ పార్టీని కూడా తక్కువ అంచనా వేయకండంటూ తనదైన స్టైల్‌లో మార్క్ డైలాగులు పేల్చారు పవన్ కల్యాణ్. పొత్తుల కోసం తాను తహతహలాడనని తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు జనసేన అధినేత. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తానని చెప్పారు. ప్రధాని, టీడీపీ సపోర్ట్‌తో మనం ముందుకు వెళ్లాటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు.
ByTrinath
హైదరాబాద్ నిజాంను గద్దె దింపిన రోజు రానే వచ్చింది. మన సంస్థానాన్ని భారత భూభాగంలోకి తీసుకురావడానికి ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ జరిగి సెప్టెంబర్ 17, 2023నాటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 'ఆపరేషన్ పోలో', 'ఆపరేషన్ క్యాటర్ పిల్లర్'తో నిజాంని భారత్ సైన్యం తరిమికొట్టింది. నాటి ప్రధాని నెహ్రూ, అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో రజాకార్లపై మొదలైన యుద్ధం ఐదు రోజుల్లోనే ముగిసింది. ఈ సైనిక చర్యకు ముందు నెహ్రూ పాక్ ప్రధానికి టెలిగ్రామ్ మెసేజ్ పంపారు.
ByTrinath
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు కేసీఆర్. ఈ ప్రాజెక్టుతో తన జన్మ ధన్యమైందన్నారు. పాలమూరు ఎంపీగానే నేను తెలంగాణ సాధించానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ.. హైదరాబాద్‌లో అడ్డా కూలీ అని.. ఇప్పుడు ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు కేసీఆర్.
ByTrinath
కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి అమెరికాలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త విని చలించిపోయానన్నారు జాహ్నవి చదువుకున్న కాలేజీ కరస్పాండెంట్. అమెరికా వద్దు..కెనడా వెళ్లమని చెప్పానని.. అయితే జాహ్నవి యూఎస్ వైపే మొగ్గు చూపిందని చెప్పారు.
ByTrinath
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 2023 సంవత్సరానికి 350 నావిక్, యాంత్రిక్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ICG Recruitment 2023
ByTrinath
బీసీసీఐ, ఐసీసీ, ఏసీసీపై శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జుణ రణతుంగా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకముందు రిజర్వ్ డేన పాక్‌పై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన గెలిచింది. దీని కారణంగా టీమిండియా ఖాతాలో అదనపు పాయింట్ పడిందని.. లేకపోతే బంగ్లాదేశ్ ఫైనల్‌కి వెళ్లేదేమోనని ఫైర్ అయ్యారు. రిజర్వ్ డే రూల్ కేవలం ఇండియా-పాక్ మ్యాచ్‌కి మాత్రమే పెట్టడంపై విమర్శలు ఆగడంలేదు.
ByTrinath
టీడీపీ యువనేత నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. నారా లోకేష్ ఉన్నపళంగా రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. లోకేశ్‌తో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన నాయుడు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్ చేపట్టినట్లు మరో టాక్ వినిపిస్తోంది.
ByTrinath
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అనేక మలుపులు తిరుగుతోంది. తాను అప్రూవర్‌గా మారలేదని అరుణ్ పిళ్లై బాంబు పేల్చారు. అప్రూవర్‌గా మారనన్న వార్తలను అరుణ్ రామచంద్ర పిళ్లై ఖండించారు. సెక్షన్ 164 కింద అరుణ్ పిళ్లై ఎలాంటి వాంగ్ములం ఇవ్వలేదు. అరుణ్ రామచంద్ర పిళ్లైపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తరుపు లాయర్లు చెప్పారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-jagan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-kalyan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pawan-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/hyd-region-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kcr-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/correspondant-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jobvs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ranatungaa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lokesss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/kavitha-arun-jpg.webp)