ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు స్టేషన్‌కు పోలీసులుతో వెళ్లేందుకు బండారు సత్యనారాయణ అంగీకరించారు. కాసేపట్లో గుంటూరు బయలదేరనున్నారు బండారు. రేపు(అక్టోబర్ 3) ఉదయం ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు పోలీసులు.
Trinath
ByTrinath
కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. సిరిసిల్లలో 20వేల డబుల్ బెడ్రూమ్‌లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండలో ఎన్ని కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని హెలికాఫ్టర్‌లో నల్గొండకు వస్తున్నావ్ కేటీఆర్ అని నిలదీశారు. చివరి శ్వాస వరకు నల్గొండకు సేవ చేయాలనేది తన కోరిక అని చెప్పారు
ByTrinath
అన్-రొమాంటిక్ భాగస్వామితో వ్యవహరించడానికి బహిరంగ కమ్యూనికేషన్, వివిధ ప్రేమ భాషలను అర్థం చేసుకోవడం, సరదా కార్యకలాపాలను సూచించడం, చిన్న హావభావాలను అభినందించడం, అవసరమైతే వృత్తిపరమైన సహాయం కోరడం, వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడం, అనుకూలతను అంచనా వేయడం అవసరం. నింద లేకుండా భావాలను వ్యక్తీకరించడం, చురుకుగా వినడం ముఖ్యం.
ByTrinath
మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు భువనేశ్వరి.
ByTrinath
బిగ్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. నిజానికి 2019 ప్రపంచకప్‌లోనూ గాయంకారణంగా ఈ మెగా టోర్నికి దూరంగా ఉన్న ధావన్ ఈ సారి మాత్రం ఫామ్‌లేక, గిల్ దూకుడిని తట్టుకోలేక జట్టుకు దూరం అయ్యాడు. అటు భారత్ జట్టు అభిమానులకు పెద్ద టోర్నమెంట్ అనగానే ధావనే గుర్తొస్తాడు. ఈసారి మాత్రం ధావన్ లేకుండానే టీమిండియా స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడనుంది.
ByTrinath
భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై విలేకరులతో వ్యవహరించిన తీరుపై మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలగితే బీజేపీలో కొనసాగుతారా అని ఓ మహిళా విలేకరి అతడిని ప్రశ్నించారు. దీనిపై అన్నామలై స్పందిస్తూ.. 'రండి అక్కా, ఇక్కడి నుంచి వచ్చి మాట్లాడండి. ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారో తమిళనాడు ప్రజలు చూడాలి' అంటూ వెటకారంగా మాట్లాడారు.
ByTrinath
అక్షర్ పటేల్ స్థానంలో టీమిండియా వరల్డ్ కప్ జట్టుకు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ని సెలక్ట్ చేయడాన్ని పలువురు మాజీలు తప్పుపడుతున్నారు. ఇండియాలో ఉండే స్పిన్ టాంపరింగ్ పిచ్‌లపై ఏ మూర్ఖుడైనా వికెట్లు తియ్యగలడాని అశ్విన్‌పై చిందులువేశాడు భారత్ మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్. అశ్విన్‌కి బదులు వాషింగ్టన్ సుందర్‌ని సెలక్ట్ చేసి ఉండాల్సిందని ఇప్పటికే యువరాజ్ సింగ్ సైతం అభిప్రాయపడ్డాడు.
ByTrinath
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ అన్నంత పనీ చేశారు. బీహార్‌లో నిర్వహించిన కుల ఆధారిత నివేదికను విడుదల చేశారు. మొత్తం 13కోట్ల బీహార్ జనాభాలో 63శాతం ఓబీసీల శాతం ఉన్నట్టు తేలింది. బ్రాహ్మణులు 3.66 శాతంగా ఉన్నారు. కుల ఆధారిత జనాభా గణనను మొదటి నుంచి వ్యతిరేకిస్తోన్న బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది. ఎందుకంటే మండల్‌కమిషన్ ప్రకారం బీసీల రిజర్వేషన్ వారి జనాభా ఆధారంగా ఇస్తున్నారు. 54శాతం బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలుతుండగా.. ఇప్పుడా సంఖ్య పెరిగితే రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుంది. ఇది అగ్రవర్ణాల ఓట్లను ప్రభావితం చేస్తుంది. Bihar caste census
ByTrinath
టీడీపీ, జనసేన పొత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ చేసిన పవర్ షేరింగ్ హాట్‌టాపిక్‌గా మారింది. అటు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్టేనన్న అనుమానం కలుగుతోంది. 25 నుంచి 40 సీట్లను జనసేన అడిగే ఛాన్స్ ఉంది. రెండున్నరేళ్లు సీఎం పదవి కోసం జనసేన పట్టుబడుతోంది. రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తేనే పూర్తిస్థాయిలో పొత్తు ఉంటుందని జనసేన చెప్పినట్టు సమాచారం.
ByTrinath
లోక్‌సభలో మహిళా బిల్లుకు ఆమోదం లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్యలున్నాయి. స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరిపారు. ఓటింగ్ స్లిప్పులను సిబ్బంది పంచారు, 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఇక బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అటు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. బిల్లుపై 60 మంది ఎంపీలు తమ అభిప్రాయాన్ని సభ వేదికగా చెప్పారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bandaru-arrest-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ktr-komatireddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/romantic-couple-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bhuvaneswari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-team-wc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bjp-annamalai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/team-india-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/modi-bc-commis-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cm-seat-sharing-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/amodam-jpg.webp)