author image

Trinath

World Teacher's day: ఆన్‌లైన్ ట్యూటర్లకు భారీ డిమాండ్.. మీరు కూడా ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు..!
ByTrinath

రేపు(అక్టోబర్‌ 5) ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్లంటే కేవలం స్కూల్స్‌, కాలేజీల్లో బోధించేవారే కాదు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ టీచింగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పార్ట్‌టైమ్‌గా ఆన్‌లైన్‌ ట్యూటర్‌ సైట్స్‌లో టీచింగ్‌ చేస్తు డబ్బులు సంపాదించుకోవచ్చు. ట్యూటర్‌ విస్టా, చెగ్గ్‌, వేదాంతూ, వీఐపీ కిడ్, ట్యూటర్ ఎంఈ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌కి కొన్ని బెస్ట్‌ ఫ్లాట్‌ఫామ్స్‌!

BRS minister supports CBN: చంద్రబాబుకు మద్దతుగా మరో బీఆర్‌ఎస్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరుగుతోంది?
ByTrinath

చంద్రబాబు అరెస్టు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై బీఆర్‌ఎస్‌ నేతల స్పందన ఎప్పటికప్పుడూ మారుతూ వస్తోంది. ఏపీ రాజకీయాలతో తమకు పని లేదని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేసిన వారం గడవకముందే మంత్రి హరీశ్‌రావు చంద్రబాబుకు సపోర్ట్‌గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడి తీరు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు తలసాని.

World Teacher's day: గౌరవం ఉంది.. జీతాలే లేవు.. ఇండియాలో టీచర్ల శాలరీలు ఇంత తక్కువా?
ByTrinath

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏటా అక్టోబర్ 5న వస్తుంది. విద్యార్థి దశ నుంచే జ్ఞానంతో పాటు జీవితంలో వెలుగులు నింపే టీచర్‌కు ఇండియాలో శాలరీలు చాలా తక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది భారతీయ ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ లేకుండానే పనిచేస్తుండగా.. వారి జీతం నెలకు సగటున రూ.10వేలు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ASIAN GAMES 2023: మరో గోల్డ్ కొట్టిన బల్లెం వీరుడు.. ఏషియన్‌ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా సత్తా!
ByTrinath

బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిశాడు. అటు 11 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో రామ్ బాబు, మంజు రాణి కాంస్య పతకాలు సాధించారు. మిక్స్ డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో ఆర్చర్లు ఓజాస్ ప్రవీణ్ డియోటాలే, జ్యోతి సురేఖ వెన్నం దక్షిణ కొరియాను ఓడించి భారత్ కు తొలి స్వర్ణ పతకాన్ని అందించారు.

World cup 2023: ధోనీ ఫ్యాన్స్‌కు అశ్విన్‌ ఝలక్‌.. గంభీర్‌ గురించి అలా మాట్లాడతారా?
ByTrinath

ఇటివలి కాలంలో ధోనీ, కోహ్లీపై విమర్శలు చేస్తూ క్రికెట్‌ అభిమానుల ట్రోలింగ్‌కు గురవుతున్న మాజీ స్టార్‌ ఓపెనర్‌ గంభీర్‌పై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఎల్లప్పుడూ జట్టు గురించి ఆలోచించే నిస్వార్థ వ్యక్తి అని అశ్విన్ కొనియాడారు. గంభీర్‌ టీమ్‌ మ్యాన్‌ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.

Chandrababu case: చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?
ByTrinath

ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇక రేపటితో చంద్రబాబు రిమాండ్‌ ముగియనుండగా.. నెక్ట్స్ ఏం జరగబోతోందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక చంద్రబాబును అధికారులు వర్చువల్‌గా ప్రవేశపెట్టనున్నారు.

Bed Bug: నిద్రపోగానే వచ్చి రక్తాన్ని తాగుతున్నాయి.. నల్లుల దెబ్బకు పారిపోతున్న ప్రజలు!
ByTrinath

ఫ్రాన్స్‌పై నల్లులు దండయాత్ర చేస్తున్నాయి. మంచంపై పరుపుకింద నక్కి ఉంటున్న నల్లులు ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రతాపం చూపుతున్నాయి. స్కూల్స్‌లోని బల్లల కింద కూడా నల్లులు గూడు కట్టుకుంటున్నాయి. దీంతో కొన్ని స్కూల్స్‌కి ఇప్పటికే సెలవులు ప్రకటించారు.పెరుగుతున్న బెడ్‌బగ్ కేసుల సంఖ్యను పరిశీలించడానికి ఈ వారంలో అత్యవసర సమావేశాలను నిర్వహిస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం తెలిపింది.

Nara Lokesh: నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!
ByTrinath

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు చంద్రబాబు కుటుంబాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. ముందుస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Sleep Tips: నిద్రకు ముందు ఈ ఆరు పనులను అసలు చేయకండి..లేకుంటే రాత్రంతా జాగారమే..!
ByTrinath

నిద్రవేళకు ముందు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. నిద్రకు అంతరాయం కలిగించే ఆరు కార్యకలాపాలను తెలుసుకోండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. పడుకునేముందు గడియారాన్ని అదేపనిగా చూడవద్దు. ఆందోళన చెందవద్దు. భారీ భోజనం చేయవద్దు. తీవ్రమైన మానసిక కర్యకలాపాలకు దూరంగా ఉండండి.

SBI JOBS: ఎస్బీఐ బ్యాంక్‌ జాబ్స్‌కు ముగుస్తున్న గడువు.. మరికొద్ది గంటలే సమయం.. త్వరపడండి!
ByTrinath

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభమై అక్టోబర్ 6, 2023న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో 442 మేనేజీరియల్, స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది.

Advertisment
తాజా కథనాలు