author image

Trinath

Beauty Tips:సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!
ByTrinath

మహిళలు ఎక్కువగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. హీరోయిన్లులాగా అందంగా కనిపించాలని భావిస్తుంటారు. దాని కోసం బ్యూటీ ప్రొడెక్ట్స్‌ని తెగ కొంటుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మంచి నీరు ఎక్కువగా తాగడం, సరిపడా నిద్రపోవడం, ఐస్ క్యూబ్స్, సన్ స్క్రీన్, హైడ్రేటింగ్ మాస్క్ లాంటి వాటితో నేచురల్‌గానే అందంగా కనిపంచవచ్చు.

BREAKING: మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
ByTrinath

మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ని నియమించారు. ఇక టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని, తెలంగాణా రైతుబందు చైర్మన్‌గా తాటికొండ రాజయ్యని, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌ని ప్రభుత్వం నియమించింది. వీరి ఎన్నికపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Harish rao: 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్‌.. మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు!
ByTrinath

ప్రాథమిక చికిత్స నుంచి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందిస్తున్నమని చెప్పారు హరీశ్‌రావు. ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లమని చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లా చేసుకున్నామని.. సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చుకున్నామని.., సిద్దిపేట కి రైల్ కూడా తెచ్చుకున్నామన్నారు హరీశ్‌రావు. ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నామని చెప్పామన్నారు. వేయి పడకల ఆస్పత్రి మనకు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Nagarjuna sagar: రేపటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల- సీఎం నిర్ణయం!
ByTrinath

తెలంగాణ వాటా కింద కృష్ణా జలాలలో మన నీరు ఉండడంతో రేపటి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు నీటిని విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఇక ఈ నెల(అక్టోబర్‌)లో తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

ENG vs NZ: ఇంగ్లండ్‌ బౌలర్లను చీల్చిచెండాడిన కివీస్‌ బ్యాటర్లు.. ఫస్ట్ విక్టరీ న్యూజిలాండ్‌దే!
ByTrinath

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఏకంగా 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 36.2ఓవర్లలోనే టార్గెట్‌ని ఫినిష్‌ చేసింది. రచిన్‌ రవీంద్రతో పాటు డెవన్‌ కాన్వే సెంచరీలతో వీరవీహారం చేయడంతో కివీస్‌ ఈజీగా గెలిచేసింది.

Pawankalyan: 'నీ సంగతి చూస్తాం కొడకా అంటూ మెసేజ్‌లు వచ్చాయి'.. పవన్‌ సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

తన ఆఫీసుపై వైసీపీ గుండాలు దాడి చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు పవన్‌ కళ్యాణ్. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం పరిధిలోని ముదినేపల్లి గురజా రోడ్డులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్డీయేలో ఉంటే ఏంటి.. బయట ఉంటే ఏంటి.. మీకు ఎందుకు భయం అంటూ పవన్‌ కళ్యాణ్‌ హాట్‌ కామెంట్స్ చేశారు.

Jagan Delhi tour: జగన్‌ ఢిల్లీ ముచ్చట.. కేంద్ర పెద్దలతో సీఎం భేటీ వెనుక ఆంతర్యం ఏంటి?
ByTrinath

రాష్ట్ర విభజన, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు, వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, కొత్త మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం సహా పెండింగ్ లో ఉన్న సమస్యలపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సీఎం ఇప్పటికే భేటీ అవ్వగా రేపు అమిత్‌షాను కలవనున్నారు జగన్‌.

Chandrayaan-3: జాబిల్లిపై చిమ్మ చీకటి.. శాశ్వత నిద్రలోకి చంద్రయాన్‌.. రోవర్‌, ల్యాండర్ ఏం చేస్తాయి?
ByTrinath

సూర్యుడు మరోసారి చంద్రుడిపై అస్తమించాడు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు 14 భూమి రోజులకు సమానమైన చంద్రుడి రోజున మేల్కొనలేదు. అంటే భారత్ మిషన్ ముగిసినట్టేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రయాన్-3లోని ప్రజ్ఞాన్, విక్రమ్ ద్వయం మేల్కొనకపోతే, అది ఎప్పటికీ భారత లూనార్ అంబాసిడర్‌గా అక్కడే ఉంటుందని ఇస్రో ఇదివరకే తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై కొన్ని ప్రయోగాలను పునరావృతం చేయడానికి ఇది ఒక అవకాశం. కానీ విక్రమ్, ప్రజ్ఞాన్ స్పందించలేదు.

Cleaning Tips: ఈ చిన్న ట్రిక్‌తో ఇళ్లంతా మెరిసిపోతుంది బాసూ.. ఈ క్లీనింగ్‌ టిప్స్‌పై ఓ లుక్కేయండి..!
ByTrinath

నిమ్మకాయ రసంతో ఇంటిని మెరిసేలా చేసుకోవచ్చు. నిమ్మకాయతో స్టవ్ టాప్ శుభ్రం చేసుకోవచ్చు. మీ వంటగది టైల్స్ ను నిమ్మకాయతో క్లీన్‌ చేసి చూడండి. మీ స్టీల్ పాత్రలను నిమ్మకాయతో క్లీన్‌ చేస్తే అవి మెరిసిపోతాయి. మీ చాపింగ్ బోర్డును నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు.

World Cup 2023: సీట్లపై కాకి రెట్టలు.. ఫ్యాన్స్‌కి ఒళ్లు మండేలా చేసిన బీసీసీఐ.. ఫస్ట్ మ్యాచ్‌ తుస్సు!
ByTrinath

ప్రపంచ కప్‌ ప్రారంభం అయ్యింది. కానీ ఆ కిక్‌ మాత్రం ఎక్కడా కనపడడంలేదు. తొలి మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులు లేక బోసిపోయింది. లక్షకు పైగా సీటింగ్‌ కెపాసిటీ ఉన్న స్టేడియం ఇది. మహిళలకు ఫ్రీ టికెట్లు కూడా ఆఫర్‌ చేసినా ఎవరూ స్టేడియంవైపు రాలేదు. వరల్డ్‌కప్‌ ఫస్ట్‌ మ్యాచ్‌ని ఇలాగేనా నిర్వహించేదని బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు