author image

Trinath

IT Raids: ఆ చిట్‌ కంపెనీల్లో నోట్ల కట్టలు.. ఐటీ దాడుల్లో సంచలనాలు..!
ByTrinath

హైదరాబాద్‌ లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపాయి. కూకట్ పల్లిలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఆయన సోదరుల ఇళ్లలో సోదాలు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులు 100 బృందాలుగా విడిపోయి గురువారం ఉదయం నగరంలోని పలు కంపెనీలు, ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని సోదాలు కొనసాగుతున్నాయి.

BREAKING: మరో 14 రోజులు జైల్లోనే.. ప్చ్‌.. చంద్రబాబుకు నిరాశే..!
ByTrinath

ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.. ఈనెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.. నిజానికి చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. అయితే రిమాండ్ పొడిగించాలని సిఐడి కోర్టులో మెమో దాఖలు చేసింది.

Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలకు నేపాల్‌లో భూకంపమే కారణమా? అసలేం జరిగింది?
ByTrinath

సిక్కింలో వరదలకు నేపాల్‌లో సంభవించిన నాలుగు భూకంపాలే కారణమా అనే కోణంలో సైంటిస్టులు పరిశోధనల చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కొందరు నిపుణులు భూకంపం వల్ల అక్కడ వరదలు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు దక్షిణ లోనాక్ సరస్సు వైశాల్యం 100 హెక్టార్లకు పైగా తగ్గినట్టు చూపిస్తున్నాయి.

Shikhar Dhawan: ఢిల్లీ కోర్టులో శిఖర్ ధావన్‌కు భారీ ఊరట.. అయేషా ముఖర్జీతో విడాకుల కేసు!
ByTrinath

క్రికెటర్ శిఖర్ ధావన్‌ను భార్య అయేషా ముఖర్జీ మానసిక హింసకు గురి చేసిందని కోర్టు తేల్చింది. ధావన్‌ ఆరోపణలను సమర్థిస్తూ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ధావన్ తన విడాకుల పిటిషన్‌లో తన భార్యపై చేసిన అన్ని ఆరోపణలను న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. ఎందుకంటే అయేషా ఈ ఆరోపణలను వ్యతిరేకించలేదు. తనను తాను సమర్థించుకోవడంలో విఫలమైంది.

World cup 2023: ఒకడు తోపు..ఇంకోడు తురుము.. ది గ్రేట్ ఖలీ, రోహిత్‌ శర్మ ఫొటో వైరల్‌..!
ByTrinath

WWE లెజెండ్స్‌లో ఒకరైన ది గ్రేట్‌ ఖలీకి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మతో కలిసి ఉన్న ఫొటో అది. అక్టోబర్‌ 5నుంచి ప్రపంచ కప్‌ ప్రారంభం అవుతుండగా జరిగిన ప్రెస్‌ కాన్ఫెరెన్స్ తర్వాత రోహిత్ శర్మ ఇలా ఖలీతో ఫొటో దిగాడు. ఇది సోషల్‌మీడియాలో మీమ్‌ ఫీస్ట్‌కు దారి తీసింది.

Love Tips: ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు అసలు వదులుకోరట.. మరి మీ సంగతేంటి?
ByTrinath

ఎక్కువగా ఫన్నిగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని ఓ అధ్యయనంలో తేలింది. బాగా నవ్వించే అబ్బాయిలతో జీవితం పంచుకుంటే లైఫ్‌ హ్యాపీగా ఉంటుందని అమ్మాయిలు అభిప్రాయపడ్డారు. 162 మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. వారితోనే డేటింగ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమ్మాయిలు చెప్పారు.

BRS vs BJP: నరేంద్ర మోదీ 'లైయేంద్ర మోదీ'గా మారారు..'హిట్లర్ అహంకారం.. బీఆర్‌ఎస్‌ నేత హాట్ కామెంట్స్!
ByTrinath

బీజేపీ నిజంగా వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకమైతే, ఏ మాత్రం క్రికెట్ అనుభవం లేని అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడని బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ మద్దత్తు కోరుతూ సీఎం కేసీఆర్ తనను అభ్యర్థించారన్న మోదీ వ్యాఖ్యలను ఖండించారు.

Balakrishna vs Jr.NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించకపోతే నాకేంటి? డోంట్‌ కేర్‌.. బాలయ్య బాబు కోపం మాములుగా లేదుగా..!
ByTrinath

చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు స్పందించపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య బాబు.

Sangeet: సంగీత్‌లో ఈ డ్రెస్సులు వేసుకుంటే డ్యాన్స్‌తో దుమ్మురేపవచ్చు.. ట్రై చేయండి!
ByTrinath

సంగీత్‌లో ఈవెంట్ క్వీన్‌ కావాలనుకుంటున్నారా? డ్యాన్స్‌తో దుమ్మురేపాలనుకుంటున్నారా? వివాహ వేడుకలన్నింటిలో సంగీత్ అత్యంత ప్రీతిపాత్రమైన వేడుకలలో ఒకటి. కాబట్టి మీ సంగీత్ నైట్‌ని ఆస్వాదించడానికి వీలు కల్పించే దుస్తులను ఎంచుకోండి. కుర్తా అండ్‌ పాలాజోస్, కో-ఆర్డ్ సెట్, లాంగ్ స్కర్ట్, క్రాప్ టాప్ బెస్ట్ ఆప్షన్స్!

Paracetamol: ప్రతి చిన్న విషయానికి పారాసిటమాల్ వాడుతున్నారా? ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పక తెలుసుకోండి!
ByTrinath

పారాసిటమాల్‌ని అధిక మోతాదులో తీసుకోవడం అసలు మంచిది కాదు. మీకు అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ చెప్పిన విధంగానే ఏ మందునైనా వాడాల్సి ఉంటుంది. పారాసిటమాల్ అధిక మోతాదు కడుపు నొప్పి, వికారం, వాంతులతో పాటు కొన్నిసార్లు ఏకంగా కోమాకు దారితీస్తుంది.

Advertisment
తాజా కథనాలు