స్కిల్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపటి(నవంబర్ 1) వరకు మీడియాతో మాట్లడొద్దని ఆదేశించింది. ఎలాంటి రాజకీయ ర్యాలీలు, ప్రసంగాలు చేయకూడదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ తమ మెమోలో కోరడంతో హైకోర్టు ఇలా చెప్పింది.
Trinath
ByTrinath
ప్రస్తుత పేసర్లలో టీమిండియా స్టార్ బుమ్రాను మించిన మరో బౌలర్ లేరన్నాడు వసీం అక్రమ్. పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదితో బుమ్రాను పోల్చడం అనవసరం అని కుండబద్దలు కొట్టాడు. కొత్త బంతితో బుమ్రా తనకంటే బెటర్‌గా బౌలింగ్ చేస్తాడంటూ టీమిండియా యార్కర్ కింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ పాక్ లెజెండ్.
ByTrinath
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబుకు బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందాల్లో మునిగిపోగా.. ఇదే సమయంలో వారికి మరో గుడ్‌న్యూస్ తెలిసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకు మద్యం కేసులో అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ఏజీ తెలిపారు.
ByTrinath
నవంబర్ 5న విరాట్ కోహ్లీ బర్త్‌డే సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) స్పెషల్ ప్లాన్స్ చేస్తోంది. అదే రోజు ఈడెన్ గార్గెన్స్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. స్డేడియానికి వచ్చే ఫ్యాన్స్‌కు కోహ్లీ మాస్కులు ఇవ్వనున్నట్లు సమాచారం. Virat Kohli Masks
ByTrinath
ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యాలు ఉంటాయా లేదా అన్నదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే బీపీఏ(బిస్ఫినాల్-A) రహితంగా లేబుల్ చేసి ఉన్న వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్లాస్టిక్‌ను ఎక్కువగా వాడడం వల్ల పర్యావరణానికి మంచిది కాదని గుర్తుపెట్టుకోండి.
ByTrinath
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్ వేసిన ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు.
ByTrinath
పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేశారు. ఇంజమామ్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఇప్పటికే ఉండగా.. మరోవైపు వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ వరుసపెట్టి ఓడిపోతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పాక్.. కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. అటు బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.
ByTrinath
ఓ దశాబ్ది కాలం తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ కళ మారుతోందా? రేవంత్ రెడ్డి దూకుడు ఫలితమేస్తోందా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల వ్యూహం కర్ణాటక లాగే పొరుగు న కూడా ఫలిస్తుందా? రాజకీయ వేత్తలనే కాకుండా సామాన్య ప్రజలనూ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలివి. కాంగ్రెస్‌లో అనైక్యత, ఎకనాయకత్వం లేకపోవడం లోపాలు అని కొందరంటున్నా అవే అనుకూలాంశాలుగా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు.
ByTrinath
పొడవాటి గోళ్లలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పొడవాటి గోళ్లలోకి మురికి, బ్యాక్టీరియా ఈజీగా ఎంట్రీ ఇస్తుంది. అవే చేతులతో మనం ఫుడ్ తింటాం. పొడవాటి గోళ్ల కింద దుమ్ము, ధూళి ఈజీగా ట్రాప్ అవుతాయి. పొడవాటి గోళ్లతో కీబోర్డు టైప్ చేయడం కష్టం. ఇది మీ వర్క్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది.
ByTrinath
తీవ్రమైన కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు కనీసం రెండేళ్ల పాటు కఠినమైన వ్యాయమాలకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. ఐసీఎంఆర్ ఇదే విషయాన్ని చెప్పిందన్నారు మాండవియా. ఇటీవల కాలంలో యుక్త వయసులోనే గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. టీనేజర్లు సైతం హార్ట్‌అటాక్‌తో చనిపోతున్నారు. ముఖ్యంగా జిమ్ చేస్తూ ఈ మరణాలు సంభవిస్తుండడంతో మాండవియా ఈ సజెషన్స్ చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chandrababu-rtv-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/bumrah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chandrababu-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohli-mask-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/drinking-water-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ktr-vs-revanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/inzamam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/telakapalli-ravi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nails-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/corona-jpg.webp)