author image

Shareef Pasha

By Shareef Pasha

జనగామ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా జిల్లాలోని ఆయా మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అప్రమత్తమైన అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. మరోపక్క అత్యవసర పనులకు వెళ్లాలనుకునే వారు, కూళీ పనులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఏదేమైన మరో రెండు రోజులు ఆగక తప్పదంటూ పోలీసులు కోరారు.

By Shareef Pasha

మాస్టర్స్ చేదివేందుకు అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ (S Jaishankar)కు లేఖ రాసింది.అక్కడ ఆ మహిళ దారుణమైన దయనీయస్థితిలో కనిపిస్తోంది.అంతేకాదు ఆమె వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి.తన చేతిలో ఏమీలేక పొరుగుదేశంలో తనొక అనాథలాగా బ్రతుకుతోంది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

By Shareef Pasha

ఖాళీగా ఉంది కదా అని ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.రూం అద్దెకు తీసుకున్న వ్యక్తి ఓనర్‌కి అద్దె కట్టకపోవడంతో కోర్టు చుట్టూ తిరిగాల్సి వచ్చింది.నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి అద్దె చెల్లించని వ్యక్తిని ఇంటి నుంచి వెళ్లగొట్టాల్సి వచ్చింది.ఈ చేదు అనుభవం ఏకంగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ క్యాపిటల్ మైండ్ సీఈఓకు ఎదురయ్యింది.ఆయన ఆవేదనను తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.అంతేకాదు రియల్ ఎస్టేట్ చేయడం అంత ఈజీ కాదని పేర్కొన్నారు.

By Shareef Pasha

ఉత్తరప్రదేశ్‌ జగోష్ గ్రామ సమీపంలోని యమునా నది నీటి అడుగున ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ కంపెనీ(IPGL)కి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఒక్కసారిగా పేలిపోయింది.ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.కానీ క్యామ్‌లో మాత్రం కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం.నదిలో 30 అడుగుల ఎత్తులో నీరు(30 Feet Hight Water) ప్రవహిస్తున్నట్లుగా వీడియోలో దృశ్యాలను చూడవచ్చు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతున్నాయి.

By Shareef Pasha

హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ క్రికెట్ పేస్‌ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఇప్పుడెక్కడ చూసిన మనోడి పేరే వినిపిస్తుంది.అంతేకాదు సిరాజ్ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు.ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో అద్భుతంగా బౌలింగ్‌లో రాణిస్తూ హౌరా అనిపిస్తున్నాడు. వర్షం ఆటను చెడగొట్టింది కానీ లేకపోతే టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0తో విజయాన్ని కైవసం చేసుకునేది.టీమిండియా మ్యాచ్ కైవసం చేసుకోలేకపోవచ్చు.కానీ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసి క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాడు.టెస్టు కెరీర్‌లో అద్భుతంగా రాణించి తొలిసారిగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

By Shareef Pasha

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్, అప్లికేషన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే ఫ్యాసెంజర్స్ మంగళవారం(25-07-2023) సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు.ఇండియన్ రైల్వేస్ యొక్క ఇ-టికెటింగ్ విభాగం IRCTC అందుబాటులో లేకపోవడానికి సాంకేతిక కారణాలే కారణమని ఇండియన్ రైల్వే పేర్కొంది.

By Shareef Pasha

అల్జీమర్స్ అనేది ఒక రకమైన మతిమరుపు వ్యాధి.ఇది కాలక్రమేణ మనుషులపై దాని ప్రభావాన్ని చూపుతోంది.ప్రారంభ దశలో ఈ వ్యాధిని మనం పూర్తిగా గుర్తించలేం.ఇది సోకిన వ్యక్తి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై దాని ప్రభావాన్ని చూపి నెమ్మదిగా జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.ఇటీవల చైనా పరిశోధకులు ప్రపంచంలోని అతి పిన్న వయస్కుడైన 19 ఏళ్ల అల్జీమర్స్ రోగిని గుర్తించారు.

By Shareef Pasha

ఓ పక్క..టమాట(tomato) ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే.. మరోపక్క..టమాటతోనే (Rates) కొంతమంది రైతుల(Farmers) ఇంట్లో సిరులు కురుస్తున్నాయి. మొన్న మహారాష్ట్ర పూణే(Pune)లో ఓ రైతు కుటుంబం టమాట సాగుతో ఏకంగా రూ.కోటిన్నర ఆదాయం పొందగా,తాజాగా ఏపీకి(AP) చెందిన రైతు కుటుంబం రూ.3 కోట్లు (3Crores) ఆర్జించింది.దీంతో సాగు ఖర్చులు,రవాణా,మార్కెటింగ్ ఖర్చులు(Markeing Expenses) పోనూ రూ.3 కోట్లు సంపాదించారు.మొత్తం 22 ఎకరాల్లో టమాట పంటతో మంచి లాభాలను (Profits) ఘటించారు.

By Shareef Pasha

దేశ రాజధాని ఢిల్లీతో సహా..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌తో సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చాలా వాహనాలు లోయలో పడిపోయాయి.

By Shareef Pasha

హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా.. నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేసి చీకటిగా మార్చాయి. నగరంలోని నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, హబ్సీగూడలో భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో నగరమంతా తడిసి ముద్ధయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సమీక్షిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు