author image

Shareef Pasha

By Shareef Pasha

సోషల్ మీడియా మోజులో పడి చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు రీల్స్‌ చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ చాలామంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలన్న ఆశతో డేంజర్‌ స్టంట్స్ చేస్తున్నారు. ఇక యువత అయితే రీల్స్‌తో తోటివారికి ఇబ్బంది కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో నిషేధ ప్రదేశాల్లోనూ రీల్స్‌ చేస్తూ జైలు పాలయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

By Shareef Pasha

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం అయినటువంటి మునుగోడులో నిరసన సెగ తగిలింది. పార్టీ కుమ్ములాటలో భాగంగా.. కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీ గూటిలో చేరాడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కాస్త.. ప్రస్తుతం జిల్లాలో రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.

By Shareef Pasha

తెలంగాణ రాష్ట్రంలో అనాదికాలంగా వస్తున్న బోనాల పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే బోనాల పండుగ రోజు కాస్త భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. పాత పగలు, ప్రతీకారాలతో భాగ్యనగరం కాస్త భగ్గుమంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, తార్నాక, పాతబస్తీ ఏరియాల్లోని కొన్ని ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల కత్తులతో దాడులు జరిగితే.. మరికొన్ని చోట్ల కర్రలతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది.

By Shareef Pasha

నిత్యం సోషల్‌మీడియాలో ఏదో ఒక వింత ఘటనకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూస్తూనే ఉంటాం.. అందులో ఒకటి భయానకం అయితే.. మరొకటి ఆనందపరిచే వీడియోలు ఉంటాయి. అయితే ఇక్కడ వీడియోలో మాత్రం ఓ ఏనుగు బస్‌కు ఎదురుగా వచ్చి అందులోని ప్రయాణికులను హడల్‌ ఎత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్ట‌ర్‌ ఖాతాలో ఈ ఇంట్రెస్టింగ్‌ వీడియోను (Viral Video)పోస్ట్ చేశారు.

By Shareef Pasha

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే (Justice CJ Alok Aradhey)ఆదివారం (23-07-2023) రోజున రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటుగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గత కొన్నేళ్ల నుంచి రాజ్‌భవన్‌కి వెళ్లని సీఎం కేసీఆర్‌, జడ్జి ప్రమాణ స్వీకారానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది.

By Shareef Pasha

“బచ్‌పన్ బచావో ఆందోళన్” వంటి పలు సంస్థలను స్థాపించి వేలాది మందికి విద్యనందించడంతో పాటు దేశంలో బాలల హక్కుల కోసం నిరంతరంగా కృషి చేస్తూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాష్ సత్యార్థి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో మొక్కలు నాటారు.

By Shareef Pasha

ఇద్దరు మహిళలను కొందరు నిందితులు నగ్నంగా ఊరేగించిన ఘటన మణిపూర్​లో చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే బెంగాల్​లో ఇదే తరహా దారుణ ఘటన ఇంకొకటి చోటుచేసుకుంది. మాల్దా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను దారుణంగా కొట్టి.. బహిరంగంగా కొందరు గ్రామస్థులు వివస్త్రలను చేశారు. జిల్లాలోని బమంగోలా పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాధిత మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు.

By Shareef Pasha

కట్టుకున్న భర్తపై ఓ భార్య కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టింది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత తన మొదటి భార్యకు సంబంధించిన వీడియోలను చూస్తున్నాడనే కోపంతో ఏకంగా భర్త మర్మాంగాలను కోసేసింది తన రెండో భార్య. దీంతో బాధితుడికి తీవ్ర రక్తస్రావం కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ దారుణ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.

By Shareef Pasha

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో(Bjp Morcha Presidents)తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి భేటీ (Meeting)అయ్యారు. ఈ మీటింగ్‌లో నాయకుల అభిప్రాయాలను కిషన్‌రెడ్డి ముందుంచారు.

By Shareef Pasha

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

Advertisment
తాజా కథనాలు