రేపటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కానుంది. ప్రపంచంలోని 36 దేశాలు ఈసారి సమ్మిట్‌లో పాల్గొంటుండగా, అందులో 18 దేశాల గవర్నర్లు, మంత్రులు సమ్మిట్‌కు తరలివస్తున్నారు. ముఖ్య అతిథిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరవుతున్నారు.

Bhoomi
ఫుట్ బాల్ ప్రపంచంలో తీరని విషాదం నెలకొంది. జర్మనీకి ప్రపంచకప్ అందించిన గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ ఫ్రాంజ్ బెకెన్‌బౌర్ కన్నుమూశారు. అతను ఆటగాడిగా, కోచ్‌గా ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.78 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
ఇండోనేషియాలోని తలాడ్ ద్వీపంలో తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం గురించి జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం ఇచ్చింది. ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
ములుగు జిల్లా కమలాపురంలోని బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( Built)మిల్లును పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాల గురించి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారీ చేస్తారు. 2014లో ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.వీరందరికీ ఉపాధి కల్పించే విధంగా సీఎం చొరవ తీసుకున్నారు.
అంగన్ వాడీల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.ప్రభుత్వం నిజాయితీగా ఉన్న విషయం చెబుతుందన్నారు. రాజకీయ అజెండాకు అంగన్వాడీలు బలికావద్దని కోరారు. జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేతనాలు పెంచేలేమని తేల్చి చెప్పారు.
తిరుమల వెళ్తున్న భక్తులకు అలర్ట్. టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. భక్తుల రక్షణ కోసం నడకమార్గాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి భయం లేకుండా నడకమార్గాల్లో శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. టీటీడీ డిఎఫ్‌వో, తిరుపతి సర్కిల్ సీసీఎఫ్, తిరుపతి డిఎఫ్‌వో లు కలిసి ప్రజంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.
జియో కస్టమర్లకు తమ నచ్చిన నెంబర్లను ఎంచుకునే వీలు కల్పించింది కంపెనీ. మొబైల్ నెంబర్ లో చివరి 4 నుంచి 6 డిజిట్స్ మార్చుకునే అవకాశం కల్పించింది జియో. ఈ అవకాశంతో మీ లక్కీ నెంబర్, పుట్టినరోజు మొదలైన వాటితో మీ మొబైల్ నెంబర్ ను సెట్ చేసుకోవచ్చు.
చలి తీవ్రత పెరుగుతుంది. కొన్ని రోజులు పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్ చేసేవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మీరు డయాబెటిస్ బాధితులు అయితే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడంతోపాటు కాలీఫ్లవర్,కారకాయ, పొట్లకాయ, బీన్స్, పాలకూరలను ఆహారంలో చేర్చుకోండి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.