Fact Check : ఈసీల నియామకం..ఆ వార్తలన్నీ ఫేక్..ఖండించిన PIB.! By Bhoomi 13 Mar 2024 భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది.
CM Revanth Reddy: మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..వేదిక వివరాలివే.! By Bhoomi 13 Mar 2024 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 15వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంవోను సీఎం ఆదేశించారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం ముస్లీం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు.
Ahmednagar: అహ్మద్‌నగర్‌కు 'అహల్యానగర్'గా పేరు మార్చిన మహారాష్ట్ర సర్కార్..! By Bhoomi 13 Mar 2024 మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మారుతూ నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హెల్కర్ పేరు మీదుగా అహల్యానగర్ గా మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నగరానికి పేరు మార్చాలనే ప్రభుత్వ ప్రతిపాదనను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే గతేడాది మేలో తొలిసారిగా ప్రకటించారు.
Breaking : వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం.. టీఎస్ నుంచి టీజీకి అమోదం.! By Bhoomi 12 Mar 2024 TS to TG : తెలంగాణలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ నుంచి టీజీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాలపై ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీగా ఉండనుంది.
Breaking: 5 రాష్ట్రాల్లోని 30 ప్రదేశాల్లో NIA ఏకకాలంలో దాడులు..! By Bhoomi 12 Mar 2024 NIA Raids : టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెక్సస్ కేసులో ఇతర కేటీఎఫ్ అనుమానితులతో సంబంధం ఉన్న 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం, 30 ప్రదేశాలలో NIA ఏకకాలంలో దాడులు నిర్వహించింది.పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఎన్‌ఐఏ బృందాలు దాడులు నిర్వహించాయి.ఈ దాడిలో డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది.
Breaking : ఎన్నికల వేళ కేంద్రం సంచలనం.. సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం! By Bhoomi 12 Mar 2024 Hyderabad Liberation Day : లోకసభ ఎన్నికలకు ముందు కేంద్రంలో మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.
PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..! By Bhoomi 12 Mar 2024 PM Narendra Modi : త్వరలోనే లోకసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈనెల 15,16,18తేదీల్లో తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
Hanu-man Team : కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసిన హనుమాన్ మూవీ టీం.! By Bhoomi 12 Mar 2024 Hanu-Man : కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి షురూ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హనుమాన్ టీం హోంమంత్రిని కలిసింది.
Plane Crash in Russia : రష్యాలో కూలిన కార్గో విమానం..వైరల్ వీడియో..! By Bhoomi 12 Mar 2024 Flight Crash : రష్యాలో సైనిక కార్గో విమానం మంగళవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో కూలిపోయింది.ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 15 మంది ఉన్నారు. ఇవానోవో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
SpiceJet : హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్..పూర్తి వివరాలివే.! By Bhoomi 12 Mar 2024 Hyderabad to Ayodhya Flights: అయోధ్య రామభక్తులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీస్ నడుపుతున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది.