author image

Bhoomi

ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం.. 25 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..!!
ByBhoomi

ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం రేగింది. 25మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూప పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.

హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు నడపకపోవడంతో ఎంజీబీఎస్ లో ప్రయాణికుల పాట్లు...!!
ByBhoomi

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడ జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్, కొత్తగూడెం చౌరస్తా వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

అమెరికాలో పని చేస్తున్న భారతీయులకు అదిరిపోయే శుభవార్త..!!
ByBhoomi

అమెరికాలో H-1B వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సర్వీసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలి స్టఫ్ గుడ్ న్యూస్ చెప్పారు. హెచ్-1బీ వీసాల దేశీయ పునరుద్ధరణ కోసం US డిసెంబర్‌లో పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. డిసెంబర్ నుంచి 3 నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Telangana Elections 2023: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి..!!
ByBhoomi

సూర్యపేట జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మఠంపల్లి మండలంలో ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తిని కర్రలతో చితకబాదారు. దాడిచేసినవారిని బీఆర్ఎస్ వర్గీయులుగా చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని బాధితుడు వాపోయాడు.

షాకింగ్ న్యూస్.. 70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు..!!
ByBhoomi

మొబైల్ వాడకం నానాటికి పెరుగుతోంది. దీంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా అధికం అవుతున్నాయి. ఆర్థిక మోసాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం 70లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు డీఎఫ్ఎస్ కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Telangana Elections 2023: ఓటు వేసాక...పొరపాటున ఈ పని చేయకండి...చేశారో అరెస్ట్ తప్పదు..!!
ByBhoomi

తొలిసారిగా ఓటు హక్కు పొంది..ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓట్లరకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం దగ్గర సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టకూడదని..అలాంటి చర్యలు ఎవరైనా పాల్పడితే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Telangana Elections 2023: ఎన్నికల సిబ్బంది ఎప్పుడు ఏం చేయాలంటే?
ByBhoomi

అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఈసీ విధివిధానాలు రూపొందించింది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు ఎన్నికల అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. పోలింగ్ విధానంలో పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది మూడు విడతల్లో ట్రైనింగ్ తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు