డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాకిచ్చింది కోర్టు.అమెరికా అధ్యక్ష పదవికి అనర్హుడని తీర్పును వెలువరించింది న్యాయస్థానం. US Presidential Election

Bhoomi
రానున్న విద్యా సంవత్సరానికి 2024-25 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా జేఎన్ వీలలో 6వ తరగతి సీట్ల భర్తీకి జనవరి 20న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు UPSC ఒక ప్రకటన విడుదల చేసింది.
బరువు తగ్గడం అనేది చాలా సవాలుతో కూడుకున్న పని. శీతాకాలంలో బరువు తగ్గడం మరింత కష్టం. కానీ కాశ్మీరీ కహ్వా తాగడం వల్ల కష్టమైన పనిని సులభతరం చేయవచ్చు. నిత్యం కాశ్మీరీ కహ్వా హెర్బల్ టీ తాగుతే కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కారు ప్రమాదానికి గురైంది. ఆలయాన్ని సందర్శించేందుకు యూపీలోని మధుర వెళ్లారు. పూంచారిలోని లోటా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. కోవిడ్ చికిత్సలకు నోడల్ కేంద్రంగా గాంధీ ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. త్వరలోనే 14వేల అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు రాష్ట్రంలోని 4వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు ఆమె తెలిపారు.
భక్తులతో శబరిమల కిక్కిరిసిపోతుంది. భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ మొదటి కేసు కేరళలో నమోదు అయ్యింది. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో ఈ మూలికలు, మసాలా దినుసులను చేర్చుకుని మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.