author image

E. Chinni

By E. Chinni

ఆగష్టు 15 సందర్భంగా జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సమావేశమయ్యారు. Pawan Kalyan Meeting With JanaSena Veera Mahila

By E. Chinni

రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. ChandraBabu and Pawan Kalyan

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు అండగా నిలుస్తాన్నమన్నారు.

By E. Chinni

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన విచారణణు నాంపల్లి సీబీఐ కోర్టు వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసుపై సోమవారం మరోసారి విచారణ జరిపిన కోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈ విచారణకు కడప ఎంపీ అవినాష్ తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు హాజరయ్యారు.

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగష్టు 15 వేడుకులకు సర్వం సిద్ధమైంది. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు..

By E. Chinni

శ్రీవారి మెట్ల మార్గంలో సోమవారం 2000వ మెట్టు వద్ద భక్తులు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగు బంటిని కొందరు భక్తులు తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు తీసి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు మెట్ల మార్గానికి చేరుకుని, పరిస్థితి సమీక్షిస్తున్నారు.

By E. Chinni

సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు.. అందినకాడికి ఎత్తుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా చోరీ చేశారు. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌1, ఎస్‌2 బోగీల్లో దొంగతనం చేశారు. నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు చైన్లు, ఆభరణాలను అపహరించారు. దీంతో తేరుకున్న ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. దీంతో అలర్ట్ అయిన గార్డులు.. తెట్టు, కావలి రైల్వే పోలీస్ స్టేషనల్లో ఫిర్యాదు చేశారు.

By E. Chinni

శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు.

Advertisment
తాజా కథనాలు