author image

E. Chinni

By E. Chinni

తిరుమల నడకదారిలో మరో చిరుత కలకలం రేపింది. ఓ బాలుడు చిరుతను చూశాను అని చెప్పడంతో.. భక్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మళ్లీ చిరుత ఎవరిపై దాడి చేస్తుందోమోనని భయంతో అరుపులు, కేకలు పెట్టారు భక్తులు. నామాలగవి దగ్గర చిరుత కనిపించిందని పులి కనిపించిందని ఆ బాలుడు చెబుతున్నాడు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

By E. Chinni

వైజాగ్ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఎన్నికల వేళ షాక్ ఎదురైంది. ఆయనకి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖ రెండో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. విశాఖ సౌత్ నుంచి తెలుగు దేశం పార్టీ తరపున గెలిచి వైసీపీలోకి జంప్ చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. దీంతో ఈ కేసును విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ..

By E. Chinni

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి ఖాసీం స్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో మహిళలు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.

By E. Chinni

దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. Pawan Kalyan Hot Comments On Volunteers

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని యేరువారిపల్లి గ్రామ వీఆర్వో వేణు గోపాల్.. ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కారు. రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పేరంగూడిపల్లికి చెందిన వలంటీర్ వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి.. తన తండ్రి లక్ష్మిరెడ్డికి ఉన్న 2.73 ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయాలని వీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించారు. అయితే ఇందుకు వీఆర్వో వేణుగోపాల్ రెడ్డి రూ.30 వేలు లంచం ..

By E. Chinni

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని..

By E. Chinni

జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజక వర్గానికి వెళ్లనున్నారు. అక్కడ వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారితో కొద్దిసేపు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ సందర్శించనున్నారు..

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ కి భారీ వర్ష సూచన ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రాష్ట్రంలో శనివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంపై ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు.. Rain Alert For AP

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీ - భర్తే ఈ దారుణానికి తెగించాడు. Doctor Radha Murder Case

By E. Chinni

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పైశాచికాచినందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. నా గురించి విమర్శలు చేసే స్థాయి లోకేష్ ..

Advertisment
తాజా కథనాలు