author image

E. Chinni

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో దారుణం చోటు చుకుంది. జిల్లాలోని ఆకివీడుకు చెందిన సంధ్య రాణి, రాంబాబు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది అయితే వీరి మధ్య గత కొంత కాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో కోర్టుకు వెళ్లి వీరు విడాకులు కూడా తీసుకున్నారు. భర్త రాంబాబును వదిలేసి సంధ్య రాణి తల్లితండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే శనివారం గుడికి వెళ్లి వస్తోన్న భార్య సంధ్యను వెనుక నుండి వచ్చిన భర్త రాంబాబు చాకుతో పీకపై కోశాడు

By E. Chinni

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంశీ తన కాన్వాయ్ లో విజయవాడ నుంచి హైదరాబాద్ బయలు దేరారు. ఈ క్రమంలో వాహన శ్రేణిలో వెనక నుంచి ఒక వాహనాన్ని మరొక వాహనం ఢీ కొట్టింది.

By E. Chinni

విజయవాడకు చెందిన సుంకర రజనీ అనే మహిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని రూ.35 లక్షల పెట్టి కొనుగోలు చేసింది. అయితే కొంత కాలం నుంచి ఈ స్థలాన్ని అమ్మేందుకు ఎంత ప్రయత్నించినా తిరిగి అమ్ముడు పోవడం లేదు. దీంతో రజనీ ఆందోళనకు గురైంది. అయితే తనకు సన్నిహితంగా ఉన్న ఒక మహిళతో ఈ సమస్యను పంచుకుంది. ఈమె అప్పుడు మేకుల బాబా గురించి చెప్పింది. దీంతో రజినీ నేరుగా అతన్ని కలిసి, స్థలం సమస్య చెప్పింది. ఇదే అదునుగా భావించిన దొంగ బాబా.. భారీగా సొమ్ము కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.

By E. Chinni

తిరుమలకు వెళ్లే నడకమార్గాల్లో విక్రయాలను సంబంధించిన విషయాలపై అటవీ, ఎస్టేట్, ఆరోగ్యశాఖల అధికారులతో సహా భక్తులకు కూడా సూచనలు చేసినట్లు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు వందకు పైగా తినుబండారాలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు.

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ లో కాపు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ నెల 22వ తేదీన కాపు నేస్తం నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్ల లో డబ్బుల్ని జమ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆ జిల్లా కలెక్టర్ మాధవీలత సమీక్ష చేస్తున్నారు

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఓ ఎంగేజ్ మెంట్ కి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో తర్లుపాడు మండలం వద్ద కలుజువ్వల పాడు వద్ద లారీ, బైక్ ఢీ కొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదం తర్లుపాడు మండలం కలుజువ్వల పాడులో జరిగింది.

By E. Chinni

తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 188వ రోజుకు చేరుకుంది. నేటి నుంచి వారం రోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పాదయాత్రకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది.Nara Lokesh Yuvagalam Padayatra

By E. Chinni

యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

Advertisment
తాజా కథనాలు