గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్ కేసులో మరోసారి మోడల్ కల్లపు లిషి గణేష్ పట్టుబడ్డారు. రెండేళ్ల క్రితమే రాడిసన్ హోటల్‌లో మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ఆమె తన సోదరి కుషితా కల్లపుతో కలిసి పోలీసులకు చిక్కారు. అయితే తాజాగా ఆమె మరోసారి పట్టుబడటం చర్చనీయాంశమైంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల వేదికగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనుంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఈ అంశంపై చర్యలు తీసుకోకుంటే.. తామే ఒక అడుగు ముందుకేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
India Poverty Levels Below 5%: దేశంలో పేదరికం 5 శాతానికి తగ్గిపోయిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది.
పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు ఆందోళనకారులు నిప్పంటించడం కలకలం రేపింది. అంతర్వాలి సారథి గ్రామంలో ఆందోళన చేస్తున్న మరాఠా కోటా ఉద్యమనేత మనోజ్ జరంగే.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి ర్యాలీగా వెళ్తానని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.