2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Bill Gates With Dolly Chaiwala: మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సునీల్ తయారు చేసిన టీని ఆస్వాదించారు.
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి.
పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది.
రేప్ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు పదేపదే పెరోల్ ఇవ్వడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనుంచి అతనికి పెరోల్ ఇవ్వాలంటే హైకోర్టు అనుమతి తప్పనిసరని హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా కోసం సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని పేర్కొన్నారు.
నగర చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. 322 అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
రాజస్థాన్ ప్రభుత్వం 2001లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్‌ను తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ.. ఓ మాజీ సైనికుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. రాజస్థాన్ సర్కార్ నిబంధనను సమర్థించింది.
అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది.
Advertisment
తాజా కథనాలు