author image

B Aravind

Telangana: పరీక్షసెంటర్‌లో మారిన నీట్‌ పేపర్‌.. ఆందోళనలో విద్యార్థులు
ByB Aravind

కొమరం భీం అసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన నీట్‌ పరీక్షలో పేపర్ మారడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా T3 GRIDU పేపర్ ఇవ్వగా.. ఆసిఫాబాద్‌లో N6 NANGU అనే పేపర్‌ ఇచ్చారు. ఈ పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.

Telangana : దారుణం.. ఉద్యోగం రాక యువకుడు ఆత్మహత్య
ByB Aravind

Boy Suicide : రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Virat Kohli : కామెంట్లు పట్టించుకోనప్పుడు ఎందుకు సమాధానమిస్తున్నారు.. విరాట్‌పై గవస్కార్‌ ఫైర్
ByB Aravind

Sunil Gavaskar : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్‌మెన్ విరాట్‌ కోహ్లీ, భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్‌ మధ్య వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు.

Andhra Pradesh : మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ
ByB Aravind

టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ(CID) విచారకు సిద్ధమైంది. మరికాసేపట్లో టీడీపీ కార్యాలయానికి సీఐడీ చేరుకోనుంది. ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ చట్టం పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందినే ఆరోపణలు వచ్చాయి.

Telangana : కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
ByB Aravind

KTR : కిన్నెర వాయిద్యకారుడు, పద్మ శ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్యకు.. మజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆర్థిక సాయం అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటున్న ఓ వీడియో వైరల్ కావడంతో కేటీఆర్ ఆయన్ని కలిసి ఆర్థిక సాయం చేశారు.

Landy Parraga Goyburo : ఈక్వేడర్‌ బ్యూటీ క్వీన్ హత్య.. కారణం ఇదే
ByB Aravind

Landy Parraga Goyburo : ఇటీవల ఈక్వేడార్‌లో సోషల్ మీడియా ఇన్‌ప్లుయేన్సర్‌ అయిన లాండీ పర్రాగా గోయ్‌బురోను ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపడం దుమారం రేపుతోంది. ఆమెకు ఓ డ్రగ్‌ డీలర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఈ హత్య వెనుక ఆయన భార్య హస్తం ఉందని తెలుస్తోంది.

Hyderabad : ‘ఆఫ్టర్‌ 9’ పబ్‌పై దాడి.. 160 మంది స్టేషన్‌కు తరలింపు
ByB Aravind

After9 Pub : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 14లో రూల్స్‌కు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారని 'ఆఫ్టర్‌ నైన్‌' పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. 160 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా
ByB Aravind

Rahul Gandhi - Amit Shah : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Uttar Pradesh : దారుణం.. టీచర్‌ను తుపాకితో కాల్చి చంపిన విద్యార్థి
ByB Aravind

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. కంప్యూటర్‌ సెంటర్‌లో క్లాసులు చెబుతున్న టీచర్‌ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు.

Telangana : రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్‌ VS బీఆర్ఎస్
ByB Aravind

Rythu Barosa : మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బంధేనని.. రైతు భరోసా కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్‌ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు