Nature: అమ్మో ఆ కప్పలు చాలా డేంజర్...

కప్పలు...మనుషులు అసహ్యించుకునే జంతువుల్లో ఇదొకటి. ప్రయోగాలకు తప్ప వీటివల్ల పెద్దగా ఏ ఉపయోగం లేదు. ఇవి ఎక్కడ పడితే అక్కడే కుప్పలు తెప్పలుగ కనిపిస్తుంటాయి. అయితే ఇందులో కొన్ని ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి కూడా ఉన్నాయని మీకు తెలుసా...

Nature: అమ్మో ఆ కప్పలు చాలా డేంజర్...
New Update

Australian Frogs: అదో కప్ప జాతి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండే కూరగాంగ్‌ ద్వీపంలో నివసిస్తాయి. ఈ జాతిలోని ఆడ కప్పలు ఆకుపచ్చ రంగులో, మగ కప్పలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. మగ కప్పలతో పోలిస్తే, ఆడ కప్పలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే, బయటకు అందంగా కనిపించే ఆడ కప్పల దినచర్య మాత్రం భయానకంగా ఉంటుంది. అందుకే, ఆ కప్పలను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.

తమ సంతానోత్పత్తిని వృద్ధి చేసుకోవడంలో భాగంగా ఆడ కప్పలు.. మగ కప్పల జత కోసం వెదకడం మొదలుపెడతాయి. తమకు తగ్గ జోడీని ఎంచుకోవడానికి మగ కప్పలకు సింగింగ్‌ కాంపిటీషన్‌ను నిర్వహిస్తాయి. తమకు నచ్చేవిధంగా మగ కప్పలు పాడితే, మెచ్చి శృంగారంలో పాల్గొంటాయి. మగ కప్ప గొంతు నచ్చకపోతే, అప్పటికప్పుడే దాన్ని నోటితో నమిలి మింగేస్తాయి. ఎంత దారుణమో కదా.. కొన్నిసార్లు మగజాతిని చూస్తే అందుకే జాలి అనిపిస్తుంది. వారి గురించి ప్రశ్నించే గొంతుకే లేదు.. ఇక అటు ఆడ కప్పలేమో మగ కప్ప గొంతు నచ్చకపోతే చంపేయడమేంటి?

నిజానికి మగ కప్పల కంటే ఆడకప్పల శరీరం, నోరు పెద్దగా ఉండటంతోనే.. అవి మగ కప్పలను మింగేస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. మగ కప్పలు సాధారణంగా 2 అంగుళాల వరకు పెరిగితే, ఆడ కప్పలు 2.75 అంగుళాల నుంచి 3 అంగుళాల వరకూ పెరుగుతాయట. కూరగాంగ్‌ ద్వీపంలోని అడవుల్లో మగ కప్పలు క్రమంగా తగ్గిపోతుండటంతో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ విషయం బయటపడింది.

Also Read: Science: ఆయుష్షును పెంచే ఔషధం..ఎలుకలపై విజయవంతం

#dagerous #green-frogs #kooragang #australian
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe