ODI World Cup 2023: టాస్‌ గెలిచిన ఆసిస్‌.. నెదర్లాండ్స్ బౌలింగ్

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.

New Update
ODI World Cup 2023: టాస్‌ గెలిచిన ఆసిస్‌.. నెదర్లాండ్స్ బౌలింగ్

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ టీమ్‌ చిన్న జట్టే అయినా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. తనదైన రోజున సంచలనాలు సృష్టించగలదు. గతంలో మూడు సార్లు వరల్డ్‌ కప్‌ గెలిచిన చరిత్ర ఉన్న వెస్టిండీస్‌ను మట్టికరిపించి నెదర్లాండ్స్ టీమ్‌ అనూహ్యంగా ప్రపంచకప్‌ టోర్నీలోకి వచ్చింది.

మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా టీమ్‌ మంచి ప్రాక్టీస్‌ సాధించాలని చూస్తోంది. ఆ టీమ్‌లో ప్రపంచంలోనే మెటీ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. ఇది వరకే టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడి భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పట్ట ఆసిస్‌ టీమ్‌.. అసలు సమరానికి ముందు జరుగనున్న రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో ఆసిస్‌ ప్లేయర్లు అందరూ ఫామ్‌లోకి రావాలని చూస్తోంది.

ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. గౌహతిలో ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా వేయలేదు. మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మధ్య మధ్యలో వరుణుడు కాస్త శాంతించినా గ్రౌండ్‌ సిబ్బంది పిచ్‌ను ఆరబెట్టే సమయానికి మళ్లీ వర్షం పడటంతో పిచ్‌ మొత్తం తడిసింది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంప్లైర్లు ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు