CRICKET: టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు!

టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు ఆస్త్రేలియా స్టార్ క్రికెట ర్ మ్యాథ్యూ వేడ్ వీడ్కోలు ప్రకటించాడు.  షెఫీల్డ్ టోర్నీ మార్చి 21 న  టాస్మానియా- వెస్ట్ ర్న మధ్య జరిగే ఫైనల్ తన రెడ్ బాల్ క్రికెట్ కు చివరదని వేడ్ స్పష్టం చేశాడు.

CRICKET: టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు!
New Update

టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కు ఆస్త్రేలియా స్టార్ క్రికెట ర్ మ్యాథ్యూ వేడ్ వీడ్కోలు ప్రకటించాడు.  షెఫీల్డ్ టోర్నీ మార్చి 21 న  టాస్మానియా- వెస్ట్ ర్న మధ్య జరిగే ఫైనల్ తన రెడ్ బాల్ క్రికెట్ కు చివరదని వేడ్ స్పష్టం చేశాడు.

2021టీ 20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సాధించటంలో మ్యాథ్యూ వేడ్ ప్రధాన పాత్ర పోషించాడు. టీ 20 ల్లో గుర్తింపు తెచ్చుకున్న వేడ్  వన్డే ,టెస్ట్ సిరీస్ లో అంత ఆశించిన స్థాయిలో ప్రతిభ కనపరచలేదు. మ్యాథ్యూ వేడ్ 2012లో టెస్ట్ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు. అతను 2021 లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆస్టేలియా జట్టులో అలెక్స్ క్యారీ రాకతో వేడ్ కు అవకాశాలు తగ్గాయి. దాంతో వేడ్ రెడ్ బాల్ క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు వేడ్ టెస్ట్ కెరీర్ లో 36 టెస్ట్ ల్లో 1613 పరుగులను   పూర్తి చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. కానీ రెడ్ బాల క్రికెట్ కు మాత్రమే వీడ్కోలు పలుకుతున్నాని, పరిమిత ఓవర్ల లో కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. వేడ్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.కాని తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్ లకు మాత్రం దూరంగా ఉంటున్నాడు.2024 జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్పు లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకునే టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

#cricket #ausralia #wade
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe