చరణ్‌ తో కలిసి నటించాలనుకుంటున్నారా..అయితే ఈ అవకాశం మీ కోసమే!

రామ్‌ చరణ్‌ తో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన ఓ సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చిత్ర బృందం ఆడిషన్‌ కాల్‌ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాస మాట్లాడే వారు ఈ సినిమాకి అవసరమని మేకర్స్‌ తెలిపారు.

చరణ్‌ తో కలిసి నటించాలనుకుంటున్నారా..అయితే ఈ అవకాశం మీ కోసమే!
New Update

చేసిన మొదటి సినిమాతోనే జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సాన. తన రెండో సినిమా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో ఉంటుందని బుచ్చిబాబు ఎప్పుడో అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని వ్రిద్ది సినిమాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు నటీనటుల కావాలంటూ చిత్ర బృందం ఆడిషన్ కాల్‌ రిలీజ్ చేశారు. కేవలం ఆడిషన్‌ కాల్ ఇవ్వడమే కాదు..దాని కోసం కొన్ని కండీషన్స్ కూడా పెట్టారు. అసలు ఈ ఆడిషన్స్‌ ఏంటి..దానికి వారు పెట్టిన కండిషన్స్‌ ఏంటి అనేది తెలుసుకుందా...

ఈ సినిమా ఉత్తరాంధ్ర ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి నేపథ్యంలో జరుగుతుంది. అందుకోసం ఉత్తరాంధ్ర యాస మాట్లాడే నటీనటులు కావాలంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఆసక్తి ఉన్న వారు ఓ నిమిషం ఉత్తరాంధ్ర స్లాంగ్‌ లో మాట్లాడుతూ నటించిన ఏదైనా వీడియోని తమకి పంపాలంటూ ఓ మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు.

అయితే రీల్స్ కానీ, సెల్ఫీ వీడియోలు కానీ పంపడానికి వీలు లేదని కండీషన్‌ కూడా పెట్టారు. ఈ వీడియోలతో పాటు మూడు ఫోటోలు, డీటెయిల్స్ కూడా మెయిల్‌ లో చెప్పాలని పేర్కొన్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం రామ్‌ చరణ్‌ సినిమాలో నటించాలనే కోరిక మీలో ఉంటే మీ టాలెంట్‌ ను చూపిస్తూ ఓ వీడియో చేసి వెంటనే పంపేయండి.

బుచ్చిబాబు చరణ్‌ సినిమా ఎప్పుడూ మొదలవుతుందా అని ఆసక్తిగా ఉన్న అభిమానులకు ఈ వార్త కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పవచ్చు. ఈ సినిమాకి ఏఆర్‌ రెహమన్‌ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని తీసుకున్నట్లు ఇప్పటికే సమాచారం తెలిసింది.

అలాగే చరణ్‌ పక్కన సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చిత్ర బృందమే తెలపాలి.

Also read: దాని వలనే సిద్దార్థ్‌ కి పడిపోయా..కియారా!

#rc-16 #ramcharan #buchibabu-sana #audition-call
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe