Uttara Pradesh: పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌...తప్పిన పెను ప్రమాదం!

కాన్పూర్‌ లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ కు పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్‌ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ని ఢీకొట్టింది.దీంతో అది 50 మీటర్ల దూరం ఎగిరిపడింది. పట్టాల సమీపంలో సిలిండర్‌ తో పాటు ఓ పెట్రోల్‌ బాటిల్, అగ్గిపెట్టెను కూడా సిబ్బంది గుర్తించారు.

New Update
Indian Railways: ఈరోజు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్..

Uttara Pradesh: ఉత్తర ప్రదేశ్‌ లోని కాన్పూర్‌ లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌ రాజ్‌ నుంచి హరియాణాలోని భివానీ వెళ్తున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్‌ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ని ఢీకొట్టింది. ట్రాక్‌ పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకో పైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.

అయితే అప్పటికే ఆ సిలిండర్‌ ను రైలు ఢీకొట్టడంతో అది పట్టాలకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కానీ దాని వల్ల రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయాన్ని లోకో పైలట్‌..రైల్వే గార్డుకు చెప్పగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫోరెన్సిక్‌ బృందం దర్యాప్తు మొదలు పెట్టింది.

పట్టాల సమీపంలో ధ్వంసమైన సిలిండర్‌ తో పాటు ఓ పెట్రోల్‌ బాటిల్, అగ్గిపెట్టెను కూడా సిబ్బంది గుర్తించారు. రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే వీటిని ట్రాక్‌ పై పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వల్ల రైలు దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. అనంతరం గమ్య స్థానానికి బయల్దేరింది.

Also Read: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. కొండచరియలు విరిగిపడే అవకాశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు