/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-11T141039.444.jpg)
జిరిబామ్ జిల్లాకు కాన్వాయ్ వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.ఈ దాడిలో ఒక భద్రతా సిబ్బంది గాయపడ్డారు.ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై పలుసార్లు తుపాకీ కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ప్రతీ కాల్పులు జరిపారు. జాతీయ రహదారి-53లోని ఒక భాగం వెంబడి కోట్లెన్ గ్రామం సమీపంలో ఇప్పటికీ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. "ఢిల్లీ నుంచి ఇంఫాల్ చేరుకోని సిఎం బీరెన్ సింగ్.. జిల్లాలో పరిస్థితిని సమీక్షించడానికి జిరిబామ్‌ను వెళ్లినట్లు" ఒక అధికారి తెలిపారు. ఈ మధ్యే అనుమానిత ఉగ్రవాదులు జిరిబామ్ జిల్లాలో రెండు పోలీసు అవుట్‌పోస్టులు, అటవీ బీట్ కార్యాలయం, 70 ఇళ్లను తగులబెట్టారు.
4 రోజుల క్రితం మణిపూర్‌లోని జిరిబామ్ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ఎస్పీ కాచర్ జిల్లా నుమల్ మహత్త తెలిపారు. భద్రతా సిబ్బందిని, ప్రత్యేక కమాండో బలగాలను మోహరించామన్నారు. సరిహద్దు ప్రాంతాలలో పహారా కాస్తున్నారు. "శాంతి ప్రేమికుల స్థానికులు మాకు సహకరిస్తున్నారు. జిరిబామ్ ప్రాంతం నుంచి దాదాపు 600 మంది ప్రజలు అస్సాం వైపు పారిపోయారు. వారు వారి బంధువుల కొన్ని ప్రదేశాలలో ఆశ్రయం పొందుతున్నారు