/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/parliament-attack-jpg.webp)
Parliament Attack: పార్లమెంట్ పై దాడి ఘటనలో విస్తూపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. లోక్‌సభలో గందరగోళం జరిగిన తర్వాత.. ఆగంతకులు కలర్ గ్యాస్ వినియోగించిన తర్వాత వారిని ఎంపీలే పట్టుకున్నారు. లోక్‌సభ బయట మరో ఇద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ నలుగురు ఎవరన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిర్బంధించబడిన నిందితుల్లో ఒకరికి జారీ చేసిన సందర్శకుల పాస్ ఇప్పటికే సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతొంది. పాస్‌లో నిర్బంధిత సాగర్ శర్మ పేరు ఉంది. మైసుర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా (Pratap Simha) పేరు మీద దీన్ని జారీ చేసినట్టు పాస్ చూస్తే అర్థమవుతోంది. మనోరంజన్, సాగర్ శర్మ కర్ణాటక-మైసూర్‌కు చెందినవారిగా గుర్తించారు. హిస్సార్-హర్యానాకి చెందిన నీలంకౌర్‌తో పాటు మహారాష్ట్ర- లాతూరుకు చెందిన అమోల్ షిండే కూడా ఉన్నారు. అయితే ఈ నలుగురు కాకుండా మరో ఇద్దరు కూడా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
మొత్తం ఆరుగురు:
ఈ కుట్రలో ఆరుగురికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ప్రాంగణం లోపల గందరగోళం సృష్టించగా, మరో ఇద్దరు బయట అవాంతరాలు సృష్టించారు. ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఢిల్లీ వెలుపలి నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు గురుగ్రామ్‌లో లలిత్ ఝా అనే వ్యక్తి నివాసంలో కలిసి ఉన్నారని తెలుస్తోంది. ఆరో వ్యక్తి గురించి ఇంకా సమాచారం లేదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/anmol.png)
ఏజెన్సీ అంతర్గత సమాచారం ప్రకారం, మొత్తం ఆపరేషన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడికి నాలుగు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sagar-sharma.png)
సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న కౌర్:
శంకర్‌లాల్ శర్మ కుమారుడు సాగర్ శర్మ, మైసూరు లోక్‌సభ సభ్యుడు ప్రతాప్ సింహా అతిథిగా సందర్శకుల గ్యాలరీకి వచ్చారు. మరో వ్యక్తి మనోరంజన్. అతను కర్ణాటకలోని మైసూర్ నివాసి. బెంగళూరులోని వివేకానంద విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. సాగర్ శర్మతో పాటు మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుంచి ఛాంబర్‌లోకి దూకారు. పార్లమెంట్ వెలుపల నిరసన చేసిన నీలం కౌర్ హర్యానాలోని హిసార్‌లోని ఒక పీజీ(పెయింగ్ గెస్ట్)గా ఉంటోంది. ఆమె హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతోంది. నీలమ్, అన్మోల్ ఇద్దరూ మొబైల్ ఫోన్ తీసుకోని రాలేదు. వారి వద్ద ఎలాంటి బ్యాగులు, గుర్తింపు పత్రాలు లేవని పోలీసులు చెప్పారు.
She is feeling a bit anxious about job prospects at the age of 35 as a student, but hey, if all else fails, JNU seems like a promising avenue for her. #ParliamentAttack pic.twitter.com/lnOmT4tqx8
— Shubham Sakhuja (@ishubhamsakhuja) December 13, 2023
Also Read: పార్లమెంట్‌లో పోలీస్‌గా మారిన ఎంపీ గోరంట్ల😎 .. నిందితులను ఎగిరెగిరి ఎలా గుద్దాడో చూడండి!
WATCH: