AP: ఏపీలో దారుణం.. ప్రేమజంటపై దాడి..! కోనసీమ జిల్లా పి. గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. By Jyoshna Sappogula 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి West Godavari: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంటపై తండ్రి కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా కొడేరు లంకకు చెందిన రమేష్, పి. గన్నవరం మండలం L. గన్నవరంకు చెందిన కొప్పాడి వరాలు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరికి మైనారిటీ తీరడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ప్రేమ జంటను అబ్బాయి కుటుంబ సభ్యులకు అప్పగించారు. Also Read: సైకిల్ పై వెళ్తున్న చిన్నారులను కాటేసిన కరెంట్.. కడపలో పెను విషాదం! దీన్ని జీర్ణించుకోలేని అమ్మాయి తండ్రి వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా కొడేరులంక అబ్బాయి ఇంటికి వెళ్ళి.. పెళ్ళి కొడుకు,పెళ్ళి కూతురి తో పాటు అక్కడ ఉన్న వారిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. దాడిలో ప్రేమ జంటతో పాటు.. పెళ్లి కొడుకు తల్లి, చెల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. #west-godavari #east-godavari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి