Attack on Kanhaiya: కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ చెంప పగల గొట్టిన యువకుడు 

ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కన్హయ్య కుమార్ పై ఒక యువకుడు దాడి చేశాడు. పూలమాల వేసే నెపంతో దగ్గరకు వచ్చిన ఆ యువకుడు కన్హయ్య కుమార్ చెంప పగలగొట్టాడు.  అక్కడే ఉన్న ఆప్ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మపై వారు అనుచితంగా ప్రవర్తించారు. 

Attack on Kanhaiya: కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ చెంప పగల గొట్టిన యువకుడు 
New Update

Attack on Kanhaiya: కాంగ్రెస్ నేత, ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి జరిగింది. పూలమాల వేయాలంటూ దగ్గరకు వచ్చిన ఒక  యువకుడు కన్హయ్యను చెంప దెబ్బ  కొట్టాడు. అంతేకాకుండా, ఆ యువకుని వెంట ఉన్న అతని స్నేహితులు కన్హయ్యను వెనక్కి తోసేశారు. ఇక దాడి చేసిన యువకుని స్నేహితులు అక్కడ ఉన్న అందరిపై ఇంకు కూడా విసిరారు. కర్తార్ నగర్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మపై కూడా అనుచితంగా ప్రవర్తించారు.

Attack on Kanhaiya: ఈ ఘటన జరిగినప్పుడు కన్హయ్యకు సంబంధించిన పలువురు మద్దతుదారులు అక్కడే ఉన్నారు. వారు ఆ తర్వాత సిరా విసిరిన వ్యక్తిని ప్రజలు కొట్టడం ప్రారంభించారు. దాడి తర్వాత కన్హయ్య స్వయంగా మాట్లాడుతూ.. 'సిరా విసరడం పెద్ద విషయం కాదు' అని అన్నారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. 

Also Read:  జేఎంఎం కీలక నిర్ణయం.. పార్టీ నుంచి సీతా సొరెన్ ఆరేళ్లు బహిష్కరణ!

Attack on Kanhaiya: సాయంత్రం 4 గంటలకు చౌత పుస్త కర్తార్ నగర్‌లోని సత్యనారాయణ భవన్ కౌన్సిలర్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ ఛాయా శర్మ తెలిపారు. “సమావేశం ముగిసిన తరువాత, కన్హయ్య కుమార్, నాయకులందరూ భవనం నుండి బయటకు వస్తుండగా, ఏడెనిమిది మంది వ్యక్తులు అక్కడికి వచ్చారు.  వారిలో ఇద్దరి వద్ద ఆయుధాలు ఉన్నాయి. వీరంతా భవనంలోకి ప్రవేశించి కన్హయ్య కుమార్‌కు పూలమాల వేయాలని అతని దగ్గరకు చేరుకొని అతడిని గట్టిగా కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నా చున్నీ పట్టుకుని చంపేస్తామని బెదిరించారు.” అని సంఘటన జరిగిన తీరును ఆమె వివరించారు. ఇక ఆ యువకునితో ఉన్న ఒకరు 30 నుంచి 40 మందిపై నల్ల ఇంకు విసిరాడని ఛాయా శర్మ చెప్పారు. గందరగోళ వాతావరణంలో పలువురు మహిళలు గాయపడినట్టు ఆమె వెల్లడించారు.  ఈ ఘటనపై కౌన్సిలర్ ఛాయా శర్మ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

కన్హయ్య కుమార్ ఆఫీస్ నుంచి ప్రకటన..

Attack on Kanhaiya: దాడి అనంతరం కన్హయ్య కుమార్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలో, “కన్హయ్యకు లభిస్తున్న భారీ ప్రజల మద్దతు మరియు ఓటమి భయంతో ప్రస్తుత ఎంపీ మనోజ్ తివారీ కలవరపడుతున్నారు. తోటి గూండాలను పంపి కన్హయ్యపై దాడికి యత్నించారు. ఈ హింసకు ప్రజలు మే 25న ఓటు వేయడం ద్వారా సమాధానం ఇస్తారు.” అని పేర్కొన్నారు. 

బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీతో పోటీ

Attack on Kanhaiya: కాంగ్రెస్ టికెట్‌పై ఈశాన్య ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్ జేఎన్‌యూ (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరకముందు కూడా ఆయన బీజేపీ, ప్రధాని మోదీలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాలపై ఆయన ఎప్పటికప్పుడు ప్రశ్నలు సంధిస్తున్నారు. బీజేపీకి  వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడిన కన్హయ్య కుమార్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను వ్యతిరేకించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ ఎంపీ, అభ్యర్థి మనోజ్ తివారీతో తలపడుతున్నారు.

#elections-2024 #delhi #kanhaiya-kumar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe