CM Ramesh: సీఎం రమేష్‌పై దాడి... పోలీసు అరెస్టు

AP: అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రమేష్ ప్రచారాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి వర్గీయులు అడ్డుకున్నారు. వాళ్లపై ముత్యాల నాయుడి వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతారవరణం నెలకొంది.

New Update
CM Ramesh: సీఎం రమేష్‌పై దాడి... పోలీసు అరెస్టు

CM Ramesh VS Budi Mutyala Naidu: అనకాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రమేష్ ప్రచారాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి వర్గీయులు అడ్డుకున్నారు. సీఎం రమేష్ పై బూడి ముత్యాల నాయుడి అనుచరులు రాళ్లు రువ్వారు.ఈ రాళ్ల దాడిలో కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ క్రమంలో దేవరాపల్లి పీఎస్‌లో ముత్యాలనాయుడిపై సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామని బెదిరించారని సీఎం రమేష్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

బూడి ముత్యాల నాయుడు, అతని కొడుకు బూడి రవి మధ్య వివాదం జరిగింది. బూడి రవితో కలిసి ప్రచారానికి వెళ్లారు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌. సీఎం రమేష్‌ను ముత్యాలనాయుడు అనుచరులు అడ్డుకున్నారు. వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తాడువలో హైటెన్షన్ మళ్లీ గొడవలు జరగకుండా భారీగా బలగాల మోహరింపు చేశారు పోలీసులు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు