Tamilnadu: తమిళనాడు(Tamilnadu)లోని శ్రీరంగం ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్వామి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు, ఆలయ భద్రత సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం తీవ్రం కావడంతో భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువులతో కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురి భక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ భక్తులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Also Read: చేయని తప్పుకు పోలీసులు కొట్టారనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య.!
This browser does not support the video element.
భద్రతా సిబ్బంది దాడిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీ భక్తులు క్యూలైన్ లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ పోలీస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్వామి వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో.. భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: రాజధానిని విశాఖకు తరలించడం లేదు.. హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్