Macherla: మాచర్లలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. టీడీపీ నేతల వాహనాలకు నిప్పు!

ఏపీలో ఎన్నికల ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లా కారెంపూడిలో టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ వర్గీయుల ఎటాక్ చేశారు. టీడీపీ నేత జానీబాషా కారుకు నిప్పు అంటించారు. ఆపేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణస్వామిపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Macherla: మాచర్లలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. టీడీపీ నేతల వాహనాలకు నిప్పు!

Macherla: పల్నాడు జిల్లా కారెంపూడిలో హింసాత్మకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం పోలింగ్ మొదలైనప్పటినుంచి వైసీపీ- టీడీపీ వర్గీయుల మధ్య మొదలైన గొడవలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. మంగళవారం ఉదయం టీడీపీ ఆఫీస్‌పై వైసీపీ వర్గీయుల ఎటాక్ చేశారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేయడంతోపాటు టీడీపీ నేత జానీబాషా కారుకు నిప్పు అంటించారు.

ఈ దాడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే పోలింగ్ రోజున గాయపడిన వాళ్ళ పరామర్శకు పేటసన్నెగండ్ల గ్రామానికి పిన్నెల్లి వెళ్తుండగా కారంపూడిలోనూ ఘర్షన వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల దాడి ఆపేందుకు ప్రయత్నించిన సీఐ నారాయణస్వామిపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు