Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. By Karthik 20 Sep 2023 in క్రైం ఖమ్మం New Update షేర్ చేయండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మారుతీ శ్రీనును(38) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శ్రీను పాల వ్యాపారం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే పాలను విక్రయించిన శ్రీను.. అనంతర వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. శ్రీను ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కోసం కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అతను సాగు చేసుకునే జామాయిల్ తోటలో శ్రీను రక్తపు మడుగుల్లో పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతరం సమీప ప్రాంతాలకు చెందిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్రీనుని ఎవరు హత్య చేశారో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీనుకు ఎవరితో అయిన గొడవలు ఉన్నాయా.. శ్రీను అంటే గిట్టని వారు ఎవరైనా ఉన్నారా.. గతంలో మృతుడితో సన్నిహితంగా ఉండి ఇప్పుడు దూరంగా ఎవరైనా ఉంటుంన్నారా అని ఆరా తీస్తున్నారు. అంతే కాదు కుటుంబ సభ్యులు అనుమానితుల పేర్లు చెప్పడంతో పోలీసులు వారి వద్దకు వెళ్లారు. మృతుడితో వారికి ఎలాంటి గొడవలు ఉన్నాయి, అవి హత్య చేసేంత పెద్ద ఘర్షణలా అని విచారిస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు డాగ్స్ స్కాడ్లను సైతం రంగంలోకి దింపారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని పోలీసులు స్పష్టం చేశారు. #palm-oil-garden #farmer-srinu #bojjaigudem #illandu #murder #bhadradri-kothagudem-district #dead-body మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి