Athletics : ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ పోటీలు మొదలు అయితే.. ఒలింపిక్స్ (Paris Olympics 2024) పూర్తి స్థాయిలో ఆరంభమైనట్లే అని క్రీడాభిమానులు అంటున్నారు. ఎందుకంటే అథ్లెటిక్స్ లో ఉండే మజాయే వేరు మరి. ఈ పోటీలు ఒలింపిక్స్ లో గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. తొలి రోజు 20 వేల మీటర్ల రేస్ వాక్ పురుషులు,మహిళల ఈవెంట్లు జరగనున్నాయి.
తర్వాతి రోజు నుంచి పరుగు పందేలతో పాటు వివిధ రకాల ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు మొదలు కానున్నాయి. ఒలింపిక్స్ కే అత్యంత ఆకర్షణ అనదగ్గ పురుషుల 100 మీటర్ల పరుగు ఫైనల్ ఈ నెల 5 న జరగబోతున్న సంగతి తెలిసిందే. 3 న తొలి రౌండ్ జరగబోతుంది.
ఈ రేసులో అమెరికా (America) స్టార్ స్ప్రింటర్ నోవా లైల్స్ (Sprinter Noah Lyles) మీదే అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత క్రీడాకారులు పోటీపడే ఈవెంట్ల పై అభిమానుల్లో ఆసక్తి, ఆశలు పెద్దగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ఛేంజ్ కి మెయిన్ రీజన్ ఎవరంటే... జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. టోక్యోలో అతని సంచలన ప్రదర్శన గురించి యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే.
ఏదో పతకంతో వస్తే చాలు అనుకుంటే ఏకంగా గోల్డ్ ని తీసుకొచ్చి భారతమాత మెడలో వేశాడు. ఈ సారి కూడా ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ నెల 6న క్వాలిఫికేషన్ ఆడి..8 న ఫైనల్ పోరుకు సిద్దమవుతున్నాడు.
Also read:టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ పై ర్యాన్సమ్‌వేర్ దాడి..300 బ్యాంకులపై ప్రభావం!