Electric Scooter : అదిరే ఆఫర్.. కేవలం రూ.2500 కడితే ఎలక్ట్రిక్ స్కూటర్! మీరు హైరేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తే...ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. అదే Ather 450 Apex.సింగిల్ ఛార్జ్ తో 157కి.మీ వెళ్తుందని. చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది. ధర రూ. 1.89లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. By Bhoomi 11 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ather 450 Apex : ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicle) యుగం నడుస్తోంది. ఈ వాహనాలు కొంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్న మాట వాస్తవం అయినప్పటికీ... ప్రజలు మాత్రం ఈ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు సరిగ్గా లేకపోవడం, మైలేజ్ తక్కువగా ఉండటం..ధర ఎక్కువగా ఉండటం ఇవన్నీ సమస్యలే. అయితే కాలక్రమేణా చాలా మార్పులు వస్తున్నాయి. క్రమంగా ఈ వాహనాల వాడకం భారీగానే పెరుగుతోంది. సౌకర్యాలూ కూడా మెరుగవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏథర్ ఎనర్జీ కంపెనీ నుంచి సరికొత్త ఈవీ వచ్చింది. అదే Ather 450 Apex. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జీతోనే 157కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. అంటే మైలేజీ సూపర్ అనే చెప్పాలి. నిజానికి ఈ కొత్త స్కూటర్ కోసం ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూశారు. దీని డిజైన్, లుక్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంది. ఈ బైక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. మొత్తానికి మార్కెట్లోకి వచ్చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను గమనిస్తే...రూ. 1.89లక్షలుగా నిర్ణయించింది కంపెనీ. అయితే ఈ ధరకు కొన్న తర్వాత టాక్సులు, ఇతరత్రా ఖర్చులు కూడా ఉంటాయి. అయితే కంపెనీ ఇదే రేంజ్ లో ఇప్పటికే 450s,450xపేరుతో రెండు మోడళ్లను తీసుకువచ్చింది. వాటిని మించిన రేంజ్ లో ఈ కొత్త స్కూటర్ ఉంది. ఈ కొత్త స్కూటర్(Scooter) లో అదనంగా 3.7 కిలో వాట్ అవర్ బ్యాటరీ కూడా ఇచ్చారు. ఈ స్కూటర్ 5 ఏళ్లు లేదా 60వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంట్ తో వచ్చింది. ఈ బ్యాటరీ పనితీరు తర్వగా అయిపోతుందేమోననే భయం అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఏథర్ 450 అపెక్స్(Ather 450 Apex) లో మొత్తం 5 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అందుకే బ్యాటరీ యూసేజ్(Battery Usage) బాగా సేవ్ అవుతుంది. వ్రాప్ మోడ్ స్థానంలో కొత్తగా వ్రాప్ ప్లస్ ను తీసుకువచ్చారు. మ్యాజిక్ ట్విస్ట్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉంది. సాధారణంగా బ్రేక్ వేసినప్పుడు థ్రోటల్ రిలీజ్ చేస్తూ బ్రేక్ అప్లయ్ చేస్తారు. ఈ కొత్త ఫీచర్ లో థ్రోటల్ రిలీజ్ చేసిన ప్రతిసారీ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. ఆటోమెటిగ్గా బ్రేక్ అప్లయ్ అవుతుంది. ఈ బైక్ ఇడియమ్ బ్లూ కలర్ లో ఉంది. బుకింగ్స్ షరూ అయ్యాయి. రూ. 2,500చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. మార్చి నుంచి డెలవరీలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఇది కూడా చదవండి: ఎయిర్ఫోర్స్ లో 3500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లికేషన్ ప్రాసెస్ ఇదే! #electric-scooter #ather-450-apex మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి