లోయలోకి దూసుకు వెళ్లిన బస్సు....8 మంది మృతి...27 మందికి గాయాలు...!

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వున్నట్టు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

author-image
By G Ramu
New Update
లోయలోకి దూసుకు వెళ్లిన బస్సు....8 మంది మృతి...27 మందికి గాయాలు...!

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంగోత్రి నుంచి బయలు దేరిన బస్సు లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షత గాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వున్నట్టు జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ వెల్లడించారు. గంగోత్రి నుంచి ఉత్తర కాశీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఘటనా ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో గుజరాత్ కు చెందిన వారే ఎక్కువగా వున్నట్టు చెప్పారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ అభిషేక్ రుహేలా, జిల్లా ఎస్పీ అర్పణ్ యదువంశీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ ను వినియోగించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. మరో వైపు ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తనను కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సహాయం, ఘటన పరిస్థితులను ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుంటున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు