/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Greta-Thunburg-jpg.webp)
హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ తగ్గేదే లే అన్నట్లు దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే పాలస్తీనాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమతిలో కూడా ఓ తీర్మానం ఆమోదం పొందింది. అలాగే ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా వివిధ దేశాల్లో పాలస్తీన్లను మద్దతుగా నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారణి గ్రెటా థన్‌బర్గ్‌కు చేదు అనుభవం ఎదురైంది. నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఆదివారం పర్యావరణ పరిరక్షణ అవగాహన కోసం ఓ సభను నిర్వహించగా.. అందుకు గ్రెటా థన్‌బర్గ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ పాలస్తీనాకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. దీంతో వెంటనే ఆమె ప్రసంగాన్ని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. గ్రెటా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పేందుకు మాత్రమే వచ్చిందని రాజకీయ ఉపన్యాసాలు చేయడం కోసం కాదంటూ ఆ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడున్నవారు ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లిపోయారు.
Also Read: దాడులు మొదలెట్టిన హిజ్బుల్లా గ్రూప్..7గురు ఇజ్రాయెల్ సైనికులకు గాయాలు
దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అయితే దీనిపై గ్రెటా స్పందించారు. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సభ అయినప్పటికీ.. మనమందరం కూడా స్వేచ్ఛ,న్యాయం కోసం పోరాడుతున్న వారి వాయిస్‌లను కూడా వినాలని వ్యాఖ్యానించారు. ప్రపంచ సమాజం మద్దతు లేకుండా ఆక్రమిత భూమిలో పర్యావరణ న్యాయం జరగదంటూ అన్నారు. అయితే ప్రస్తుతం గ్రెటా ప్రసంగాన్ని ఆ వ్యక్తి అడ్డుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా.. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత గాజాకు మద్దతుగా కొందరు ప్లకార్డులను పట్టుకొని ఉన్న చిత్రాన్ని గ్రెటా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందుకు ఇజ్రాయెల్ కూడా స్పందించింది. హమాస్ దాడుల వల్ల అనేకమంది ప్రాణాలు పోయాయని.. వారి కోసం కూడా మాట్లాడండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
Greta Thunberg was briefly interrupted by a man who approached her on stage after she invited a #Palestinian and an Afghan woman to speak at a climate protest in the #Dutch capital.
The Swedish activist, speaking in a traditional black and white Palestinian scarf, said the… pic.twitter.com/Ma7HGBcolw
— NEXTA (@nexta_tv) November 12, 2023