Kitchen Vastu: మీ వంట గదిలో ఈ వస్తువులు ఉన్నాయా..? జాగ్రత్త..! వంటగదిలో ప్రతికూల శక్తి తినే ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వాస్తు ప్రకారం వంటగదిలో కొన్ని వస్తువులు ఉంచడం ఈ ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 09 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Kitchen Vastu: వంటగదిలో సానుకూల ప్రభావం ఉండటం చాలా ముఖ్యం. అయితే చాలా సార్లు మనకు తెలిసో తెలియకో వంట గదిలో కొన్ని వస్తువులు ఉంచుతాము. ఈ వస్తువులను వంట గదిలో ఉంచడం ఇంట్లో ప్రతికూల శక్తికి కారణమవుతాయి. ఇది మీరు తినే ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, అందువల్ల, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి.. వంటగదిలో ఉంచిన ఈ వస్తువులను వెంటనే బయట పడేయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వంటగదిలో ఏమి ఉంచకూడదు నూరిన పిండిని వంటగదిలో ఎక్కువసేపు ఉంచకూడదు. పిండిని ఫ్రిజ్‌లో లేదా వంటగదిలో రాత్రిపూట ఉంచడం వల్ల రాహువు, శనిగ్రహాల ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా పెంచుతుంది. కొంతమంది తమ వంటగదిని అలంకరించుకోవడానికి అద్దాలను ఉపయోగిస్తారు. అయితే వంటగదిలో అమర్చిన గాజు అద్దం ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగదిలో అద్దం అమర్చడం వల్ల ఇంటి సంతోషం, ప్రశాంతత దూరమవుతాయి. వంటగదిలోని మురికి ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అలాగే వంటగదిలో రాత్రిపూట తిన్న పాత్రలను ఎప్పుడూ ఉంచకూడదు. రాత్రిపూట వంటగదిలో శుభ్రం చేయని పాత్రలు ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీని ద్వారా ఆర్థిక పరిస్థితి కూడా క్షీణిస్తుందని నమ్ముతారు. కొందరికి వంటగదిలో మందులు పెట్టే అలవాటు ఉంటుంది. ఇంట్లోని వంటగదిలో మందులను ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యుల ఆరోగ్యంపై ముఖ్యంగా తలపై చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల, వంటగదిలో మందులను ఉంచవద్దు. విరిగిన, పగిలిన పాత్రలను ఇంటి వంటగదిలో ఉంచకూడదు. విరిగిన పాత్రలను ఉపయోగించడం మీ అదృష్టానికి దూరం చేస్తుంది. అలాగే చేస్తున్న పని కూడా ముందుకు సాగదు. గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: Cancer : ఈ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణం..? కొనేటప్పుడు జాగ్రత్త.! #vastu-tips #kitchen-hacks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి