Donot transact money at all on this day of the week: ఏ రోజున డబ్బుల లావాదేవీలు చేయాలో తెలుసా? ఏ గ్రహం ప్రభావం ఏ దిశలో ఉంటుందో దృష్టిలో ఉంచుకుని మనం డబ్బు లావాదేవీలు జరపాలి. ఎవరైనా ఎప్పుడైనా డబ్బు లావాదేవీలు చేయాల్సి రావచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల స్థానాలు లేదా వారం వారీగా డబ్బు లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రియమైన వారి నుంచి.. కొన్నిసార్లు స్నేహితుల నుంచి లేదా కొన్నిసార్లు బ్యాంకు నుంచి.. లేదా ఎవరికైనా రుణం ఇచ్చేటపుడు లేదా తీసుకునేటప్పుడు ఈ నియమాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
సోమవారం- ఇది చంద్రుని రోజుగా పరిగణించబడుతుంది. చంద్రుడు తీవ్రమైన ఫలితాలను ఇస్తాడు. ఈ రోజు త్వరగా పూర్తి చేయాల్సిన పనులు పూర్తి చేయాలి.
మంగళవారం- కుజుడు మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు. ఈ రోజున విద్య, వ్యాజ్యం ప్రారంభించడం మంచిది కాదు.
బుధవారం - బుధ గ్రహానికి చెందిన రోజు. ఇది వినోదం, డబ్బు విషయాలకు ఉత్తమమైనది. ఈ రోజు అప్పులు చేయవద్దు.
గురువారం- ఈ రోజు చాలా పవిత్రమైనది. ఈ రోజున మాంసాహారం, మద్యం సేవించకూడదు. దక్షిణం వైపు ప్రయాణించవద్దు.
శుక్రవారం - ఇది శుక్ర గ్రహానికి చెందిన రోజు. ఈ రోజు డబ్బు పెట్టుబడి పెట్టడం మానుకోండి.
శనివారం- ఇది శనిగ్రహానికి చెందిన రోజు. ఈ రోజు చేసే చర్యల ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. తూర్పు వైపు ప్రయాణం చేయవద్దు.
ఆదివారం- ఇది సూర్య భగవానుడి రోజు. ఈ రోజు పేరు ప్రతిష్టలు, ఉన్నత స్థానాలను తీసుకువస్తుంది. ఏదైనా పనిని ప్రారంభించేందుకు ఈ రోజు శుభప్రదం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. RTV దీన్ని ధృవీకరించలేదు.
Also Read: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్!
WATCH: