భూమికి దగ్గరగా ఆస్టరాయిడ్.. గుర్తించిన నాసా....

New Update

అంతరిక్షంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనిపెడుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే.. తిరుగుతున్న గ్రహశకలం ఒకటి ఈ నెల 15న భూమి సమీపంలో నుంచి దూసుకెళ్లనుంది. సైంటిస్టులు దీనిని ‘2020 డీబీ5’ గా కనుగొన్నారు. ఇది దాదాపు కిలోమీటర్​ అంత ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ఆస్టరాయిడ్​ గంటకు 34 వేల కి.మీ. వేగంతో భూమికి దాదాపు 43 లక్షల కిలోమీటర్ల చేరువలోకి రానుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

asteroid-near-earth

1995లో ఇదే గ్రహశకలం భూమి సమీపంలో నుంచి వెళ్లిపోయిందని, ఈ నెల 15 తర్వాత మళ్లీ 2048 మే 2న భూమికి దగ్గరగా వస్తుందని వివరించారు. అదేవిధంగా, ‘1994 ఎక్స్ డి’ అనే మరో గ్రహశకలం కూడా సోమవారం భూమి పక్క నుంచి దూసుకెళ్లిందని నాసా సైంటిస్టులు తెలిపారు.గతంలోనూ గతంలో ఇలాంటి గ్రహశకలాలు ఎన్నో కొద్దిదూరం తేడాగా వెళ్లాయని తెలిపారు.

2012లో ఇదే ఆస్టరాయిడ్​ భూమికి దగ్గరగా వచ్చిందని, మళ్లీ 2030లో మరోమారు భూమి పక్క నుంచి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు వివరించారు. ఇది గంటకు 77 వేల కిలోమీటర్ల వేగంతో సుమారు 32 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు