వరద నష్టంపై అంచనా.. తెలంగాణలో కేంద్ర అధికారుల బృందం తెలంగాణలో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల.. వంతెనలు కూలిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కాలనీల్లోకి నీరు పోటెత్తటంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. By Vijaya Nimma 30 Jul 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి కేంద్ర బృదం తనిఖీలు వరద నష్టాన్ని అంచనా వేయటానికి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఏర్పడిన వరదల మూలంగా అనేక జిల్లాలో నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. ఈ అధికారుల బృందంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, స్పేస్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉన్నారు. నష్టాన్ని అంచనా వేయడం ఈ అధికారుల బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారుడు కునాల్ సత్యార్థి నాయకత్వం వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించి జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న వివరాలను కూడా జతపరుస్తూ.. కేంద్ర అధికారుల బృందం నివేదిక తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వరద బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందని చెప్పారు. అండగా ఉంటాం వరంగల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటించారు. భూపలపల్లి జిల్లా మోరంచపల్లికి చేరుకున్న ఆయన అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడారు. రంగంపేటకు చేరుకొని వరద బాధితులను పరామర్శించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి