Assam Floods: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో గత కొన్ని రోజులుగా కురస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. బ్రహ్మపుత్ర దాని ఉపనదులతో సహా ప్రధాన నదులకు వరదలు పోటేత్తాయి. ఈ వరదలకు సుమారు ఆరున్నర లక్షల మంది పైగా నిరాశ్రయులైయారు.
నేషనల్,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గోలాఘాట్ ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శించారు.
గుజరాత్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా జునాగఢ్ జిల్లాలోని 30 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. జునాగఢ్ జిల్లా వండలి గ్రామంలో 24 గంటల్లో 36.1 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయమైయాయి.
Also Read: గతంలో కూడా హత్రాస్ లాంటి అనేక విషాదాలు.. వందలాదిగా మరణాలు.. లిస్ట్ ఇదే!