కేసీఆర్‌నగర్‌గా నామకరణం..
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్‌ను కొల్లూరులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టౌన్ షిప్‌కు కేసీఆర్‌నగర్‌గా నామకరణం చేశారు. సీఎం చేతులు మీదుగా ఆరుగురు లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను అందుకొన్నారు. గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లూరు చేరుకున్న సీఎం ముందుకు డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ ఆవరణలో మొక్క నాటారు. అనంతరం టౌన్ షిప్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
భారీ బడ్జెట్‌తో నిర్మాణం..
కొల్లూరులో మొత్తం 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరిగింది. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్ షిప్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్‌కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌ల ఏర్పాటు చేశారు. టౌన్ షిప్‌లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాలను నిర్మించారు.