Asian Games: ఏషియన్ గేమ్స్-2023లో భారత్ పతకాలతో దూసుకుపోతోంది. తాజాగా, ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు మరో స్వర్ణం లభించింది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని 230-229తో ఓడించి స్వర్ణం సాధించింది. భారత ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్ , పర్నీత్ కౌర్ ఈ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.
మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో (women's singles quarterfinals) జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 82 పతకాలు చేరాయి. కాగా, ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైనల్‌లో ఓజాస్ డియోటల్, జ్యోతి సురేఖ జంట స్వర్ణం సాధించింది. అదేవిధంగా సునీల్ కుమార్, గ్రెసొ జంట రజతం గెలుపొందింది.
ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ తనదైన ముద్ర వేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యుత్తమ పతకాలను సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో భారత్ ఇప్పటివరకు 19 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలతో మొత్తం 82 పతకాలు సాధించింది.