Asian Games: భారత్‌కు మరో స్వర్ణం.. దుమ్మురేపిన మహిళలు..!! ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై 230-280 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. By Jyoshna Sappogula 05 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Asian Games: ఏషియన్ గేమ్స్-2023లో భారత్ పతకాలతో దూసుకుపోతోంది. తాజాగా, ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు మరో స్వర్ణం లభించింది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని 230-229తో ఓడించి స్వర్ణం సాధించింది. భారత ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్ , పర్నీత్ కౌర్ ఈ గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం. GOLD MEDAL NO. 19 🔥🔥🔥 Archery: The trio of Jyothi, Aditi & Parneet beat Chinese Taipei 230-228 in Women's Compound Team Final. 82nd medal overall #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/WLfMBtjtOj — India_AllSports (@India_AllSports) October 5, 2023 మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో (women's singles quarterfinals) జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్‌తో కూడిన జట్టు ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 82 పతకాలు చేరాయి. కాగా, ఆర్చరీలో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఫైనల్‌లో ఓజాస్ డియోటల్, జ్యోతి సురేఖ జంట స్వర్ణం సాధించింది. అదేవిధంగా సునీల్ కుమార్, గ్రెసొ జంట రజతం గెలుపొందింది. ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ తనదైన ముద్ర వేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యుత్తమ పతకాలను సాధించింది. ఏషియన్ గేమ్స్-2023లో భారత్ ఇప్పటివరకు 19 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలతో మొత్తం 82 పతకాలు సాధించింది. Also Read: చూసినోళ్ళకు చూసినంత…క్రికెట్ పండగ మొదలవుతోంది. #asian-games-2023 #womens-singles-quarterfinals-won-gold-medal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి